పవన్ కళ్యాణ్ రాజకీయాల కోసం రెండేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్నా.. ఆయనపై ఫాన్స్ కున్న అభిమానము తగ్గలేదు, మార్కెట్ లో పవన్ వాల్యూ పడిపోలేదు. రెండున్నరేళ్ల గ్యాప్ తో మళ్ళీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ క్రేజ్ కి ఎలాంటి డ్యామేజ్ జరగలేదనేది ఆయన లేటెస్ట్ ఫిలిం వకీల్ సాబ్ లుక్స్ రిలీజ్ అప్పుడు, టీజర్ ట్రేండింగ్ లోకి వచ్చినప్పుడు అర్ధమైపోయింది. అందుకే దిల్ రాజు కూడా పవన్ కళ్యాణ్ క్రేజ్ నే వాడడం కరెక్ట్ అని భావించినట్లుగా కనబడుతుంది. ఆయన నిర్మించిన షాదీ ముబారక్ ప్రమోషన్స్ కూడా సో సో గా చేసేసి దానిని బాగా లైట్ తీసుకున్నాడు. నేడు ఎలాంటి చప్పుడు లేకుండా షాదీ ముబారక్ రిలీజ్ అయ్యింది. అయితే దిల్ రాజు పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ పై బాగా కాన్సంట్రేట్ చేసి ముఖ్యంగా పవన్ నే హైలెట్ చేసేలా ప్లాన్స్ చేస్తున్నాడు.
పింక్ లో అమితాబ్ ఎలా ఉన్నారు, తమిళ పింక్ రీమేక్ లో అజిత్ ఎలా ఉన్నారు. తెలుగులో వకీల్ సాబ్ పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నారు. ఇక పోస్టర్ లో కూడా కనీసం హీరోయిన్ ఫోటో పెట్టడం లేదు. కేవలం పవన్ తప్ప. సాంగ్ చూడండి, పోస్టర్ చూడండి, టీజర్ చూడండి అంతా పవన్ హీరోయిజం. ఆయన లాయర్ కోటు తప్ప వకీల్ సాబ్ లో మరో మొహం కనబడితే ఒట్టు. మరి వకీల్ సాబ్ ప్రమోషన్స్ లో పవన్ కి తప్ప మరొకరికి స్థానం లేదా? జనసేనలోను పవన్ ఒక్కరే స్టేజ్ మీద కనబడుతున్నట్టుగా ఇక్కడ వకీల్ సాబ్ ప్రమోషన్స్ లోను పవన్ ఒక్కరే కనిపిస్తున్నారు. మరి వకీల్ సాబ్ పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో అని చెప్పబోతున్నారా? అసలు ఫాన్స్ కి నచ్చినట్టుగా ఎంత ఎలాంటి మార్పులు వకీల్ సాబ్ లో చేసారో కానీ.. ప్రస్తుతం వకీల్ సాబ్ అంటే పవన్. పవన్ అంటే వకీల్ సాబ్ అంతే. అంజలి, నివేత థామస్ ఇలా ఎవరికీ ప్రాముఖ్యత అనేది కనిపించడం లేదు.