Advertisement
Google Ads BL

గుంపులో గోవిందంలా అయ్యిపోయారు


జనవరి నుండి వారం వారం సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో కొన్ని సక్సెస్ అవుతుంటే.. మరికొన్ని పేరూ ఊరూ లేకుండా పోతున్నాయి. వారం వారం ఒకటి రెండు కాదు.. ఏడెనిమిది సినిమాలతో థియేటర్స్ మోగిపోతున్నాయి. గత వారం ఏడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ వారం పది సినిమాలకు పైగానే రిలీజ్ అవుతున్నాయి. చిన్నా చితక మీడియం బడ్జెట్ మూవీస్ అన్ని పొలోమంటూ ఈ ఫ్రైడే థియేటర్స్ మీద దాడి చేస్తున్నాయి. సందీప్ కిషన్ A1 ఎక్సప్రెస్ తో పోటీకి సిద్దమయ్యాడు. అలాగే రాజ్ తరుణ్ పవర్ ప్లే, దిల్ రాజు హ్యాండ్స్ నుండి సాగర్ హీరోగా షాదీ ముబారక్ సినిమాలతో పాటుగా రాజేంద్ర ప్రసాద్ క్లైమాక్స్, తారకరత్న మరియు సురేష్ కొండేటి దేవినేని, ప్లే బ్యాక్, తోటా బావి మరియు 3 డి చిత్రం శ్రీ పరమన్ ఈ శుక్రవారం విడుదలవుతున్నాయి.

Advertisement
CJ Advs

గజకేసరి, విక్రమార్కుడు, ఖోస్ వాకింగ్, జుడాస్ అండ్ ది బ్లాక్ మెస్సీయ లాస్ట్ డ్రాగన్ వంటి డబ్బింగ్ చిత్రాలు కూడా మార్చి 5 న థియేటర్లలోకి వస్తున్నాయి. అయితే అందులో చెప్పుకోదగ్గ చిత్రాల్లో సందీప్ కిషన్ A1 ఎక్సప్రెస్, రాజ్ తరుణ్ పవర్ ప్లే, షాదీ ముబారక్ చిత్రాలు. ఈ మూడు చిత్రాలకే ట్రేడ్ లోను, ప్రేక్షకుల్లోనూ అంతో ఇంతో అంచనాలున్నాయి. సందీప్ అయితే A1 ఎక్సప్రెస్ తో హిట్ ఖాయమంటున్నాడు. అదే విధంగా రాజ్ తరుణ్ కూడా పవర్ ప్లే మీదే ఆశలు పెట్టుకుంటున్నాడు. సాగర్ హీరోగా వస్తున్న షాదీ ముబారక్ ట్రైలర్ కూడా ఆకట్టుకునేలా ఉన్నా వీక్ ప్రమోషన్స్ వలన ఈ సినిమాకి కూడా అంతగా హైప్ కనిపించడం లేదు. మరి ఈ పది సినిమాల మధ్యన రాజ్ తరుణ్, సందీప్ కిషన్, సాగర్ లు కూడా గుంపులో గోవిందంలా అయ్యిపోయారు కానీ ఎలాంటి స్పెషల్ కనిపించడం లేదు.

14 Films Releasing This Week!:

14 Films Releasing On This Friday
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs