Advertisement
Google Ads BL

ఆ ఇద్దరూ అడ్డంగా దొరికిపోయారు


బాలీవుడ్ లో గత ఏడాది డ్రగ్స్ కేసు ఎంతగా ప్రకంపనలు సృష్టించిందో.. అంతే ప్రకంపనలు సృష్టిస్తుంది ఇప్పుడు తాప్సి, అనురాగ్ కశ్యప్ పై జరుగుతున్న ఐటి దాడులు. నిన్నటి నుండి తాప్సి ఇంటిపై, ఆమె ఆఫీస్ పై, అనురాగ్ కశ్యప్ ఇంటిపై ఆఫీస్ లపై ఐటి దాడులు బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నేడు చేసిన దాడుల్లో తాప్సి ఐదు కోట్లకి లెక్కలు తారు మారు చేసినట్టు గుర్తించడంతో.. ఐటి అధికారులు తాప్సి పన్ను యాడ్ ఎండోర్స్మెంట్స్, అలాగే ఆమె సినిమా ఒప్పందాలపై నిఘా పెట్టినట్టుగా చెబుతున్నారు. తాప్సి సినిమాల కమిట్మెంట్స్ లో కోట్లు చేతులు మారినట్టుగా.. అవి లెక్కల్లోకి రాకుండా జాగ్రత్తలు పడినట్లుగా గుర్తించినట్లు చెబుతున్నారు. 

Advertisement
CJ Advs

అలాగే అనురాగ్ కశ్యప్ కూడా 20 కోట్లు లెక్కల్లో చూపకుండా నకిలీ పాత్రలు సృష్టించినట్లుగా ఐటి శాఖ అధికారులు గుర్తించినట్లు తెలుస్తుంది. 20 కోట్లు లెక్కలోకి రాకుండా ఎగ్గొట్టేందుకు అనురాగ్ కశ్యప్ ప్లాన్ చేసినట్లుగా ఐటి శాఖ అధికారులు గుర్తించారు. ఇప్పటికే అంటే నిన్న బుధవారం ఫాంటమ్ ఫిల్మ్స్ అనే నిర్మాణ సంస్థ పన్నులు ఎగ్గొట్టిన కేసులో.. ముంబై, పూణెలోని 22 చోట్ల అధికారులు సోదాలు చేశారు. ఫాంటమ్ తో సంబంధమున్న వ్యక్తులే లక్ష్యంగా దాడులు కొనసాగుతున్నాయి. ఇంకా దాడులు జరుగుతాయని చెబుతున్నారు ఐటి అధికారులు. ఈ కేసులో తాప్సి, అనురాగ్ అడ్డంగా ఇరుక్కున్నారని అంటున్నారు. మరి ఈ కేసు ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి.

Income Tax department raids Taapsee Pannu, Anurag:

Income Tax Department raids properties of Taapsee and Anurag Kashyap  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs