ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది పూజ హెగ్డే. పాన్ ఇండియా మూవీస్, హిందీ మూవీస్, తెలుగు మూవీస్ అబ్బో పూజ హెగ్డే లెక్క మాములుగా లేదు. ముంబై లో ఈమధ్యనే ఓ ఇల్లు కూడా కొనేసింది. తెలుగులో రెండు రెండున్నర కోట్ల రెమ్యునరేషన్ తో టాప్ పొజిషన్ లో ఉన్న పూజ హెగ్డే.. బాలీవుడ్ లో నాలుగు కోట్ల దాకా వసూలు చేస్తుంది అని.. రణ్వీర్ సింగ్, రోహిత్ శెట్టి కాంబోలో తెరకెక్కుతున్న సర్కస్ మూవీ కోసం పూజ నాలుగు కోట్లు అందుకోబోతుంది అనే టాక్ ఉంది. మరి పూజ ఇప్పుడు ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నది అన్న మాట నిజం. ప్రభాస్ తో పాన్ ఇండియా రేంజ్ మూవీ రాధేశ్యామ్ తో పూజ హెగ్డే రేంజ్ మరింతగా పెరిగింది.
అయితే అమ్మడు ఇప్పుడు తమిళ్ లోకి కాలు పెట్టబోతోంది. తమిళంలో స్టార్ హీరో విజయ్ సరసన ఓ మూవీ చెయ్యబోతున్న పూజ హెగ్డే ఆ సినిమాకి ఏకంగా మూడున్నర కోట్లు డిమాండ్ చేసింది అనే టాక్ కోలీవుడ్ మీడియాలో వినిపిస్తుంది. ఇప్పటివరకు తెలుగు, హిందీ భాషల్లో దున్నేస్తున్న పూజ హెగ్డే ఇప్పుడు తమిళ్ లోకి ఎంట్రీ ఇవ్వడమే స్టార్ హీరో సినిమాతో ఎంట్రీ ఇవ్వడం ఒక విశేషం అయితే.. అక్కడ టాప్ రేంజ్ పారితోషకం తీసుకోవడం మరో విశేషం అనే చెప్పాలి. నిజంగా పూజ తమిళంలో అంత పారితోషకం అందుకుంటుంటే.. అక్కడ కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయన్ కి గట్టి పోటీ తగిలినట్టే. ఎందుకంటే తమిళంలో భారీ పారితోషకం తీసుకునే తారల్లో నయన్ నెంబర్ వన్ కాబట్టి.