Advertisement
Google Ads BL

జాతి రత్నాలు.. నవరత్నాల నవ్వులు


నవీన్ పోలిశెట్టి-ప్రియదర్శి-రాహుల్ రామకృష్ణ కాంబోలో స్వప్న సినిమాస్ బ్యానర్ అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన జాతి రత్నాలు మార్చ్ 11 న విడుదలకు సిద్దమవుతుంది. నవీన్ పోలిశెట్టి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో కామెడీగా, ఎమోషనల్ గా అదరగొట్టేసాడు. ఇప్పుడు జాతి రత్నాలు అంటూ కామెడీ కామెడీ చేస్తున్నాడు. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలతో కలిసి నవీన్ చేసిన కామెడీతో జాతిరత్నాలపై అంచనాలు పెరిగిపోతున్నాయి. భారీ ప్రమోషన్స్ తో దూసుకుపోతున్న జాతిరత్నాలు ట్రైలర్ ని ఇంతకూ ముందే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రిలీజ్ చేసారు.

Advertisement
CJ Advs

10th లో 60% ఇంటర్ లో 50% బిటెక్ లో 40% ఏందిరా ఇది అని నవీన్ పోలిశెట్టి ఫాదర్ అడుగుతుంటే అందుకే ఎంటెక్ చెయ్యలేదు అంటూ ఫన్నీగా చెబుతాడు నవీన్. మరీ గలీజ్ గా లేడీస్ ఎంపోరియం శ్రీకాంత్ అని పిలుస్తున్నారు నాన్నా అని ఫీలైపోతుంటాడు. హీరోయిన్ పేరు తెలుసుకోవడానికి హీరో పడే తంటాలు, చెంప మీ పేరు కదూ అంటే.. చెంప పగులుద్ది అని హీరోయిన్ అనడం.. నవీన్ లుక్స్ అన్ని కామెడీని పండిస్తున్నాయి. ప్రియదర్శి, రాహుల్, నవీన్ మధ్యలో వెన్నెల కిషోర్ కూర్చుని ఈ మొత్తం చంచల్ గూడా జైల్లో బెస్ట్ బ్యాచ్ అంటే మా బ్యాచ్ రా.. 2008 బ్యాచ్ అంటూ గొప్పగా చెప్పడం, లేడీస్‌ ఎంపోరియ‌మ్‌ని.. లేడీస్ ఎంప‌వ‌ర్ మెంట్ గా మార్చెయ్యడం, శత్రువు శత్రువు కలిస్తే అజాత శత్రువు కాదురా.. మిత్రుడవుతాడు అంటూ నవీన్ చెప్పే డైలాగ్..  పోలీస్ స్టేష‌న్‌కి వ‌చ్చి.. అవుటాఫ్ స్టేష‌న్ అని క‌వ‌ర్ చేసుకోవ‌డం..  ఇలా అన్ని ఫన్నీగానే ఉన్నాయి.

నవనీన్ ఫేస్ లోనూ, ఎక్సప్రెషన్స్ లోనూ, లుక్స్ లోనూ కూడా కామెడీ పండించేసాడు. ట్రైలర్ లోనే ఇంత కామెడీ పుట్టించారంటే.. మరి రెండు గంటలో సినిమాలో మరెంత కామెడీ ఉంటుందో అంటున్నారు ప్రేక్షకులు. జాతిరత్నాలు నిజంగా నవరత్నాల నవ్వులు పూయించడం ఖాయం. ఇది 100 % కామెడీ ఎంటరైనర్ అని ట్రైలర్ చూసి చెప్పెయ్యొచ్చు.

Click here For Jathi Ratnalu Trailer

Jathi Ratnalu Trailer: Unlimited Fun:

Jathi Ratnalu Trailer review
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs