ఉప్పెన సినిమా సక్సెస అవడంతో ఓవర్ నైట్ స్టార్ డం ని ఎంజాయ్ చేస్తున్న కృతి శెట్టి కి నెక్స్ట్ మూవీస్ పక్కా హిట్ అవుతాయనే నమ్మకంతో ఉంది. నాని శ్యామ్ సింగరాయ్, సుధీర్ బాబు సినిమాలు ఒప్పుకున్న కృతి శెట్టి ప్రస్తుతం ఆ షూటింగ్స్ లో బిజీగా వుంది. ఉప్పెనతో కృతి శెట్టి ఒక్కసారిగా ఫెమస్ అవ్వడమే కాదు.. ఆమె క్రేజ్ కి హీరోల చూపు ఆమెపై పడింది. ఉప్పెన సినిమాకి ఆరు లక్షల పారితోషకానికి అడ్జెస్ట్ అయిన కృతి శెట్టి రేంజ్ ఇప్పుడు 60 లక్షలు. ఇకపై ఒప్పుకోబోయే సినిమాలకు కోటి చేసేసింది అనే టాక్ మొదలైంది. ఉప్పెన బేబమ్మ భారీ రెమ్యునరేషన్ అంటూ అప్పుడే హెడ్ లైన్స్ తో న్యూస్ స్టార్ట్ అయ్యింది.
ఒక్క హిట్ కెరీర్ ని మార్చేస్తుంది అనేది ఎప్పటినుండో వింటున్న, చూస్తున్న మాటే. ఇప్పుడు అదే పరిస్థితిలో కృతి శెట్టి ఉంది. అందుకే కోరికల చిట్టా విప్పుతుంది. ఈ మధ్యన కృతి శెట్టిని ఓ టాలీవుడ్ నిర్మాత కలిసి సినిమా చేద్దామని అడిగితే కోటి రెమ్యునరేషన్ అడిగి షాకివ్వడమే కాదు.. హోటల్ రూమ్ ఖర్చు దగ్గరనుండి కారవ్యాన్, కాస్ట్యూమ్స్, ఫుడ్ వగైరా వగైరా అన్ని ఆ నిర్మాత ముందు చిట్టా పెట్టేసేసరికి.. అమ్మో కోటా? అందులోని పై ఖర్చులా? వద్దులెమ్మా.. స్టార్ హీరోయిన్స్ కి కూడా ఇన్ని డిమాండ్స్ ఉండవు. ఒక్క హిట్ కే ఎగిరెగిరి పడుతున్నావ్ తర్వాత చూద్దాం అంటూ చల్లగా జారుకున్నాడట. మరి బేబమ్మ కోరికల చిట్టా కి ఇంకెంతమంది నిర్మాతలు షాకవ్వాల్సి వస్తుందో మున్ముందు తెలుస్తుంది అంటున్నారు.