Advertisement
Google Ads BL

అల్లు అర్జున్ యమా స్పీడుగా ఉన్నాడు


అల్లు అర్జున్ అలా వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ తర్వాత ఇమ్మిడియట్ గా సుకుమార్ తో పుష్ప పాన్ ఇండియా మూవీ మొదలు పెడదామనుకుంటే.. కరోనా క్రైసిస్ బన్నీ ప్లాన్స్ పాడు చేసింది. ఇక నవంబర్ నుండి పుష్ప ని పట్టాలెక్కించిన బన్నీ.. సుకుమార్ తో కలిసి రాత్రీపగలూ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. విరామం అన్నదే లేకుండా పుష్ప షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో బన్నీ ఉన్నాడు. ఎందుకంటే ఆగష్టు 13 న పుష్ప వరల్డ్ వైడ్ రిలీజ్ అంటూ డేట్ ప్రకటించడంతో సుకుమార్ కూడా బన్నీని  ఫాలో అవ్వక తప్పడం లేదు. ఈమధ్యన సుకుమార్ తన కూతురు హాఫ్ సారీ ఫంక్షన్ కి కూడా ఒక రోజు వచ్చి మళ్ళీ వెంటనే తిరిగి వెళ్లిపోయాడంటే ఏ రేంజ్ స్పీడులో పుష్ప షూటింగ్ చిత్రీకరణ ఉందో అర్ధం చేసుకోవచ్చు. లేదంటే సుకుమార్ చెక్కుడు తెలియంది కాదు.. పుష్ప సినిమా ఏడాదికి కానీ పూర్తి అయ్యేది కాదు. కానీ బన్నీ మాత్రం సుకుమార్ ని నిలువనియ్యడం లేదు.

Advertisement
CJ Advs

మారేడుమిల్లి, రంపచోడవరం ఫారెస్ట్ లో భారీ షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న పుష్ప టీం వెంటనే తమిళనాడులోని టెన్ కాశీ పరిసర ప్రాంతాల్లో మరో షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. అక్కడ షెడ్యూల్ పూర్తి కాగానే పుష్ప టీం హైదరాబాద్ కి పయనమైంది. మరి రిలీజ్ డేట్ ఇచ్చాక ఎలాంటి విరామం తీసుకోకుండా షూటింగ్ కోసం కష్టపడుతుంది టీం. టెన్ కాశీలో అల్లు అర్జున్, రష్మిక, ఇంకొంతమంది నటీనటులపై కుటుంబ నేపథ్యం ఉన్న కీలక సన్నివేశాల చిత్రీకరణ ముగిసింది. అదే లొకేషన్స్ లో ఓ సాంగ్ చిత్రీకరణ కూడా పూర్తి చేసేసారు. ఇంతకుముందు ఆగష్టు 13 కి డేట్ ఇచ్చారు. అయితే పుష్ప అనుకున్న డేట్ కి రావడం అసాధ్యం అనుకున్నారు. కానీ అల్లు అర్జున్ స్పీడు, జోరు చూస్తుంటే.. అనుకున్న టైం కి ఎలాంటి అనుమానాలు, ఆటంకాలు లేకుండా పుష్ప థియేటర్స్ కి దిగడం ఖాయం.

Pushpa 3rd Schedule Wrapped up:

Allu Arjun and Pushpa team wrap up a Tenkasi schedule
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs