Advertisement
Google Ads BL

ప్రభాస్ అడ్రెస్స్ మార్చేస్తున్నాడా


ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. బాహుబలి తర్వాత పాన్ ఇండియా లెవల్ ని మెయింటింగ్ చేస్తున్న ప్రభాస్ బాహుబలి తర్వాత సాహో లాంటి భారీ ప్రాజెక్ట్ చేసాడు. సాహో తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా లిస్ట్ తెలిసిందే. రాధేశ్యామ్ షూటింగ్ ఫినిష్ అయ్యి.. జులై 30 న విడుదలకు సిద్దమవుతుంది. ఇక ప్రభాస్ అటు సలార్ షూటింగ్, ఇటు ఆదిపురుష్ షూటింగ్ తో బిజీ కాబోతున్నాడు. ప్రస్తుతం సలార్ షెడ్యూల్ ఒకటి పూర్తి చేసి ఆదిపురుష్ కోసం ముంబై లో మకాం పెట్టాడు. ప్రభాస్ ఇప్పుడు హైదరాబాద్ - ముంబై అంటూ తిరగక్కర్లేదు. అన్నీ పాన్ ఇండియా మూవీస్ కాబట్టి ఎక్కువగా ముంబైలోనే ఉండాలి. అందుకే ముంబైలో ఓ ప్లాట్ కోనేసే ఆలోచనలో ప్రభాస్ ఉన్నట్లుగా సోషల్ మీడియా టాక్.

Advertisement
CJ Advs

ఇటు సినిమాల్తో పాటుగా ప్రభాస్ ముంబై వేదికగా వ్యాపారం మొదలు పెట్టె యోచనలో ఉన్నాడట. అందుకే ఏకంగా ముంబైకి మకాం మార్చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లుగా చెబుతున్నారు. ముంబైలోనే ఎక్కువగా గడుపుతున్న ప్రభాస్ హోటల్ రూమ్స్ కి కోట్లు ఖర్చుపెట్టడం ఎందుకు అని.. ముంబై లోని ఖరీదైన ప్రాంతంలో ఇంటిని కొనుగోలు చెయ్యడానికి రెడీ అయ్యాడట. ప్రస్తుతం ప్రభాస్ టీమ్ ముంబై లో ప్రభాస్ కోసం ఖరీదైన ప్లాట్ వేటలో ఉందట. ఆదిపురుష్ తర్వాత నాగ్ అశ్విన్ మూవీ కూడా పాన్ ఇండియా మూవీ కాబట్టి ప్రభాస్ ఇలాంటి ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. 

ఈమధ్యనే పూజ హెగ్డే ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసి గృహప్రవేశం కూడా చేసింది. మరోపక్క రష్మిక ముంబైకి మకాం మార్చినట్టుగా అక్కడ ఇల్లుకొనేసినట్టుగా ప్రచారం జరుగుతుంది. ఇక ఇప్పుడు ప్రభాస్ కూడా అదే బాటలో నడుస్తున్నాడు.

Is Prabhas changing his address?:

Prabhas Shifting Base To Mumbai From Hyderabad?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs