శశికళ పేరే సంచలనం.. శశికళ చుట్టూ తమిళ రాజకీయాలు తిరుగుతూన్నాయి. దివంగత మాజీ సీఎం జయలలితకు వెన్నంటి ఉండి జయలలిత తరువాత శశికళనే అనే గుర్తింపు తెచ్చుకొని తమిళ రాజకీయాలలో జరిగిన మార్పుల వల్ల జయలలితకు దూరమై ఆమె మరణం తరువాత మళ్ళీ తమిళ రాజకీయాలలోకి వచ్చింది. తన మార్క్ రాజకీయాలలో బిజీగా ఉన్నతరుణంలో జైలు జీవితం గడపవలసి వచ్చింది. ఈమధ్యనే జైలు నుండి విడుదలైన శశికళ మళ్ళీ రాజకీయాల్లో చక్రం తిప్పుతుంది అని అందరూ భవించారు. అందరూ అనుకున్నట్టే శశికళ బెంగుళూరు నుండి చెన్నై కి పెద్ద కార్ల ర్యాలీతో హంగామా సృష్టించింది. జైలు నుండి విడుదులైన ఆమెపై అందరి దృష్టి పడింది.
శశికళ రాజకీయాల్లో బిజీ అవుతూ అన్నాడిఎంకె కి స్పాట్ పెడుతుంది అని అన్నాడీఎంకే నాయకులు భావించారు. అలాగే జయలలిత సమాధి చూట్టు కూడా శశికళ రాజకీయాలు నడిపింది. మళ్ళీ జయలలిత సమాధి సాక్షిగా శశికళ రాజకీయ చదరంగం ఆడుతుంది.. తమిళ రాజకీయాలు వేడెక్కుతున్న తరుణంలో శశికళ సడన్ గా రాజకీయాల నుండి పూర్తిగా తప్పుకుంటున్నట్టు ప్రకటించి షాకిచ్చింది. తనకు పదవులపై వ్యామోహం లేదని, తమిళనాడులో జయలలిత బంగారు పాలన అన్నాడిఎం కే తోనే సాధ్యం అని, డీఎంకే ను ఓడించాలంటూ సన్సేషనల్ కామెంట్స్ చేసింది. దీనితో తమిళ రాజకీయాలో శశికళ నిర్ణయంపై హాట్ హాట్ చర్చలు మొదలయ్యాయి.