Advertisement
Google Ads BL

ఆదిపురుష్ పై ఇంత కసా?


ప్రభాస్ - ఓం రౌత్ కాంబోలో పాన్ ఇండియా మూవీగా బాలీవుడ్ లో తెరకెక్కబోతున్న ఆదిపురుష్ కోసం ప్రభాస్ హిందీ భాషలో పట్టు సాధించడంతో పాటుగా ఫిట్ నెస్ కోసం స్పెషల్ జిమ్ కూడా చేస్తున్నట్టుగా ఓమ్ రౌత్ ఎప్పుడో చెప్పాడు. ప్రస్తుతం ప్రభాస్ లుక్స్ పై ప్రభాస్ ఫాన్స్ కి కంప్లైంట్స్ ఉన్నాయి. అందుకే ఓం రౌత్ తన సినిమాలో రాముడి గెటప్ కోసం ఫిట్ గా కనిపించాలని ప్రభాస్ కి టార్గెట్ పెట్టడంతో ఆ పాత్ర కోసం ప్రభాస్ బాగా వర్కౌట్స్ చేస్తున్నారు. అయితే ఫిబ్రవరిలో పూజా కార్యక్రమాలతో మొదలైన ఆదిపురుష్ రెగ్యులర్ షూట్ కూడా అదే నెలలో మొదలు కావల్సిఉంది. కానీ ఆదిపురుష్ పూజా కార్యక్రమాలు జరుగుతూన్న టైం లో ఆదిపురుష్ కోసం వేసిన భారీ సెట్ లో అగ్నిప్రమాదం జరగడంతో ఆదిపురుష్ షూటింగ్ అనుకున్న టైం కి అనుకున్నట్టుగా మొదలుకాలేదు.

Advertisement
CJ Advs

అయితే ప్రమాదవశాత్తు ఆ అగ్ని ప్రమాదం జరిగింది అనుకుంటే.. ఇప్పుడు లేటెస్ట్ గా అది అనుకోకుండా జరిగిన అగ్నిప్రమాదం కాదంటున్నారు. ఈ ప్రమాదానికి సంబందించిన ఇన్వెస్టిగేషన్ లో ఆదిపురుష్ అగ్నిప్రమాదంపై నమ్మలేని నిజాలు బయటికి వచ్చాయంటున్నారు. అదేమిటంటే ఆదిపురుష్ సినిమా ప్రకటించడం, రావణ్ గా విలన్ పాత్రకి  బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పేరు ప్రకటించగానే సైఫ్ కాస్త గొప్పగా ఆదిపురుష్ లో రావణ్ పాత్ర గొప్పగా ఉండబోతుంది అంటూ చేసిన కామెంట్స్ కి మత ఛాందసవాదులు ఎంతగా రచ్చ చేసారో తెలిసిందే. ఆఖరికి సైఫ్ అలీఖాన్ దిగొచ్చి సారి చెబితేనే కానీ శాంతించలేదు. అయినప్పటికీ కొంతమంది ఆ రావణ్ పాత్రపై సైఫ్ చేసిన వ్యాఖ్యలను మనసులో పెట్టుకుని సినిమా మొదలయ్యే టైం కి అంటే ఆదిపురుష్ పూజా కార్యక్రమాలతో మొదలవుతుంది అనుకున్న టైం కి ఆదిపురుష్ సెట్ ని ధ్వంశం చేశారనే టాక్ బయటికి వచ్చింది. 

So much for Adipurush?:

Unbelievable facts about the Adipurush are coming out
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs