Advertisement
Google Ads BL

పుష్ప తో కాదు.. కానీ బాలీవుడ్ ఎంట్రీ ఉంటుంది


అనసూయ బుల్లితెర మీద మాత్రమే కాదు.. వెండితెర మీద కూడా ఓ వెలుగు వెలుగుతుంది. ప్రస్తుతం అనసూయ నటించిన థాంక్యూ బ్రదర్ సినిమా విడుదలకు సిద్దమవుతుండగా. రవితేజ ఖిలాడీ మూవీ లో రవితేజ తో ఢీ అంటే ఢీ అనే కేరెక్టర్ లో నటిస్తుంది. మరోపక్క చావుకబురు చల్లగా సినిమాలో ఊర మాస్ సాంగ్ లో అనసూయ మాస్ స్టెప్స్ ఫొటోస్ అండ్ సాంగ్ బాగా హైలెట్ చేస్తుంది చిత్ర బృందం. రీసెంట్ గా అనసూయ మట్లాడుతూ.. తాను మూడు సినిమాల్లో నటిస్తున్నా అని.. సినిమాలో నిడివి ఎంతున్నది అనేది ఇంపార్టెంట్ కాదని పాత్రకి ప్రాధాన్యం ఉంటే చాలని, అలాగే తాను అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ఫిలిం పుష్పలో తాను ఓ కీలక పాత్రలో నటిస్తున్నా అని వస్తున్న వార్తలో నిజం లేదని తాను పుష్ప సినిమాలో నటించడం లేదని క్లారిటీ ఇచ్చింది.

Advertisement
CJ Advs

అంతేకాకుండా తమిళంలో ఓ సినిమా, మలయాళంలో మమ్ముట్టి సరసన నటిస్తున్నా అని చెప్పిన అనసూయకి బాలీవుడ్ ఆఫర్స్ కూడా వస్తున్నాయట. అంటే అనసూయ త్వరలోనే బాలీవుడ్ కీ ఎంట్రీ ఇవ్వబోతుంది అని తెలుస్తుంది. ఇప్పటికే కొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయని చెబుతుంది అనసూయ. అంటే చాలా తొందరగానే అనసూయ బాలీవుడ్ ఎంట్రీ ఉండబోతుంది అనేది క్లారిటీ ఇచ్చేసినట్టే. మరి బుల్లితెర హాట్ యాంకర్ ఇకపై బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మల్లువుడ్ అంటూ చేసే హడావుడితో మిగతా యాంకర్స్ కుళ్ళుకోవాల్సిందే.. 

Not with a Pushpa.. but there will be a Bollywood entry:

Anasuya Rejects Allu Arjun Pushpa Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs