పూరి జగన్నాధ్ దర్శకత్వంలో లైగర్ పాన్ ఇండియా ఫిలిం లో నటిస్తున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం ముంబైలో ఉన్నాడు. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న లైగర్ మూవీఫై భారీ అంచనాలున్నాయి. అయితే గతంలో అంటే విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ లో డియర్ కామ్రేడ్ తర్వాత నేను చెయ్యడానికి ఇంకేం లవ్ స్టోరీస్ లేవు. ఇదే నా చివరి లవ్ స్టోరీ అంటూ డియర్ కామ్రేడ్ సినిమాపై అంచనాలు పెంచేసాడు. మరి డియర్ కామ్రేడ్ తో ఎలాంటి ఫలితాన్ని, ఎలాంటి లవ్ స్టోరీని విజయ్ దేవరకొండకి ఇచ్చాడో క్రాంతి మాధవ్ అనేది చూసాం. ఇప్పుడు విజయ్ దేవరకొండ బాటలోనే నితిన్ కూడా అదే చెబుతున్నాడు.
చెక్ ప్రమోషన్స్ లో భాగంగా నితిన్ రంగ్ దే సినిమానే నా చివరి లవ్ స్టోరీ అంటూ చెప్పుకొచ్చాడు. అంటే నితిన్ ఇక లవ్ స్టోరీస్ జోలికి వెళ్లాడా? దీనిని బట్టి నితిన్ - కీర్తి సురేష్ హీరో హీరోయిన్స్ గా వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న రంగ్ దే మీద నితిన్ ఎన్ని హోప్స్ పెట్టుకున్నాడో అర్ధమవుతుంది. రంగ్ దే క్యూట్ లవ్ స్టోరీ, ఫ్రెష్ లవ్ స్టోరీ అని చెప్పడం ఓకె. మరి రీసెంట్ గ నితిన్ చెక్ అంటూ విభిన్నంగా ట్రై చేసి దెబ్బతిన్నాడు. గత వారమే నితిన్ చెక్ సినిమా విడుదలై నెగిటివ్ టాక్ తో వీక్ కలెక్షన్స్ తెచ్చుకుంటున్న సంగతి తెలిసిందే. మరి ఈ నెల 26 న విడుదల కాబోతున్న రంగ్ దే ని నితిన్ చివరి లవ్ స్టోరీ అంటూ చెప్పడం చూస్తే నితిన్ కి ఆ సినిమాపై మంచి హోప్స్ ఉన్నాయని అనిపిస్తుంది. అయితే విజయ్ మాదిరిగా నితిన్ కూడా ఇలా చెప్పి దెబ్బైపోడు కదా అంటూ నితిన్ అభిమానులు కంగారు పడుతున్నారు. ఎందుకంటే నితిన్ లవర్ బాయ్ గా కొట్టిన హిట్స్ ముందు.. మాస్ హీరోగా హిట్ కొట్టలేక విలవిలలాడిన సంగతి తెలిసిందే.