Advertisement
Google Ads BL

మరో హీరో తమ్ముడు దిగుతున్నాడు


ఒకవైపు నాగ చైతన్య తమ్ముడు అఖిల్.. అఖిల్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. మూడు సినిమాలు చేసినా.. ఇంకా హీరో గా ప్రూవ్ చేసుకోవడానికి సఫర్ అవుతున్నాడు. అఖిల్ లేటెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ జూన్ 19 న రిలీజ్ కాబోతుంది. ఆ సినిమా అయినా హిట్ అవుతుంది హీరోగా నిలబెడుతుంది అనే నమ్మకంతో అఖిల్ ఉన్నాడు. ఇంకో వైపు అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ కూడా హీరోగా ప్రూవ్ చేసుకోవాలని తహతహలాడుతున్నాడు. అల్లు శిరీష్ నటించిన సినిమాలేవీ బ్లాక్ బస్టర్ హిట్ అవకపోవడంతో హీరోగా ఎదగాలనే కసితో కష్టపడుతున్నాడు. అక్కడ ఇద్దరు హీరోల తమ్ముళ్లు హీరోలుగా కష్టాలు పడుతూ సఫర్ అవుతున్నారు. ఇంకో వైపు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ తేజ్ వచ్చి ఫస్ట్ ఫిలిం తోనే ఉప్పెన లాంటి సక్సెస్ ని చవి చూసాడు.

Advertisement
CJ Advs

అలాగే విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా దొరసాని, మిడిల్ క్లాస్ మెలోడీస్ తో హీరోగా పర్లేదు అనిపించుకుంటూ.. మంచి ఐడెంటిఫికేషన్ తెచ్చుకున్నాడు. ఇమ్మిడియట్ గా పుష్పక విమానం సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పుడు ఇదే బాటలో ఇంకో హీరో తమ్ముడు కూడా రంగంలోకి దిగబోతున్నాడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ సాయి గణేష్ హీరోగా తెరంగేట్రం చెయ్యబోతున్నాడు. ఇప్పటికే నటనలో శిక్షణ కూడా తీసుకున్నాడు గణేష్. ఇక్కడ విశేషం ఏమిటి అంటే.. బెల్లంకొండ గణేష్ ఎంట్రీ మూవీ ని చాలా గ్రాండ్ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై చినబాబు ప్రొడ్యూసర్ గా కొత్త డైరెక్టర్ చెప్పిన కథ ఓకె అయ్యింది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమా రాబోతుంది. తన పెద్ద కొడుకు కోసం టాప్ హీరోయిన్స్ ని, టాప్ టెక్నీషియన్స్ ని పట్టుకొచ్చే బెల్లంకొండ సురేష్ ఈ సినిమా కోసం బిహైండ్ ద స్క్రీన్ ఎంత కీ రోల్ ప్లే చేస్తాడో చూడాలి.

Popular banner to launch Bellamkonda Ganesh debut film :

Bellamkonda Sai Srinivas Brother Sai Ganesh Entry in Movies
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs