Advertisement
Google Ads BL

అల్లరి గతం.. నాంది భవిష్యత్తు


అల్లరి నరేష్ కి అల్లరి అనే పేరు.. రవిబాబు దర్శకత్వంలో నరేష్ నటించిన కామెడీ ఎంటర్టైనర్ అల్లరి సినిమాతో వచ్చింది. ఆ సినిమా దగ్గరనుండి నరేష్ కామెడీ అల్లరి నరేష్ అవతారమెత్తాడు. అప్పటినుండి కామెడీ సినిమాలు చేస్తూ అల్లరి నరేష్ గా మారిపోయాడు. మధ్య మధ్యలో గమ్యం, శంభో శివ శంభో, నేను లాంటి చిత్రాలు చేసినా అల్లరి నరేష్ కి అల్లరి అనే పేరు ఉండిపోయింది. అయితే తాజాగా అల్లరి నరేష్ ఇప్పుడు నాంది సినిమాతో అద్భుతమైన హిట్ కొట్టాడు. సూర్య ప్రకాష్ గా అల్లరి నరేష్ ఖైదీగా నాంది లో సూపర్ పెరఫార్మెన్స్ తో నాంది సినిమాని సక్సెస్ తీరానికి నడిపించాడు.

Advertisement
CJ Advs

ఎనిమిదేళ్ల తర్వాత నాంది తో హిట్ కొట్టిన అల్లరి నరేష్ ని ఆయన పెరఫార్మెన్స్ ని పొగడని వారు లేరు. రీసెంట్ గా నాంది సినిమాని చూసి రేయ్ రేయ్ రేయ్..@అల్లరినరేష్ పేరు మార్చేయ్ ఇంక.. అల్లరి గతం, భవిష్యత్తుకి ఇది నాంది.. సూపర్ హ్యాపీ రా అంటూ ట్వీట్ చేసాడు హీరో నాని. దానికి థాంక్యూ బాబాయ్ అంటూ నరేష్ రిప్లై ఇచ్చాడు. మరి నాంది సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న అల్లరి నరేష్ కి నాని కరెక్ట్ గా చెప్పాడు. అల్లరి వదిలేసి.. పెరఫార్మెన్స్ ఉన్న కేరెక్టర్స్ కి నాంది పలకమని. ఇక అల్లరి నరేష్ కూడా జబర్దస్త్ లోకి నాంది ప్రమోషన్స్ కి వచ్చినప్పుడు.. అల్లరి నరేష్ తన సినిమాలని కామెడీ హిట్ అంటారు కానీ.. నరేష్ కామెడీ బాగా చేసాడు అనరు. అలాగే నేను, శంభో శివ శంభో, ప్రాణం వంటి సినిమాల్లో అల్లరి నరేష్ బాగా నటించాడు అంటారు అంటూ పెరఫార్మెన్స్ కి ఎంత క్రేజ్ ఉంటుందో చెప్పాడు. మరి నాని చెప్పినట్టు.. నాంది అనేది అల్లరి నరేష్ భవిష్యత్తుకి నాంది అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం. 

Nani overjoyed after watching Naandhi:

Nani suggestion for Allari Naresh
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs