నిన్న రాత్రి మద్యం మత్తులో జూబ్లీహిల్స్ ఏరియా లో మూడు కార్లను గుద్దేసిన యూట్యూబ్ స్టార్, షార్ట్ ఫీల్ స్టార్, దీప్తి సునయన బాయ్ ఫ్రెండ్ షణ్ముఖ్ జస్వంత్ ని పోలీస్ లు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. మద్యం తాగి డ్రైవ్ చేస్తూ యాక్సిడెంట్ చెయ్యడంతో షణ్ముఖ్ జస్వంత్ కి బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చెయ్యగా అందులో 170 పాయింట్స్ రావడంతో పోలీస్ లు షణ్ముఖ్ జస్వంత్ ని స్టేషన్ కి తరలించగా అక్కడ షణ్ముఖ్ జస్వంత్ పోలీస్ లకు డబ్బులిచ్చి సెటిల్ చేసుకుందాం అంటూ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతేకాకుండా పోలీస్ లతో వాదిస్తూ, మీడియా ని వారిస్తూ కెమెరాలు ఆఫ్ చేయమంటూ షణ్ముఖ్ జస్వంత్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.
షణ్ముఖ్ జస్వంత్ పోలీస్ స్టేషన్ లో చేసిన కొన్ని వ్యాఖ్యలను చూసి నెటిజెన్స్ ఫైర్ అవుతున్నారు. నేను ఆక్సిడెంట్ చేశాను. కానీ ఎవరూ హాస్పిటల్ పాలవలేదు.. ఎవరూ హాస్పిటల్ కి వెళ్ళలేదు కదా అన్నా.. ఒక్కసారి నాతో మాట్లాడండి.. డబ్బులు కావాలంటే ఇచ్చేస్తాను.. అంటూ షణ్ముఖ్ జస్వంత్ మాట్లాడడం చూసిన నెటిజెన్స్ షణ్ముఖ్ జస్వంత్ పై ఫైర్ అవుతున్నారు. తప్పతాగి కారు డ్రైవ్ చేసిందే కాకుండా యాక్సిడెంట్ చేసి దాన్ని కవర్ చేసుకుంటూ.. నేను గుద్దాను, ఎవరూ హాస్పిటల్ పాలవలేదు అంటే ఏమిటి అర్ధం.. అంటూ నెటిజెన్స్ షణ్ముఖ్ జస్వంత్ పై విరుచుకుపడుతున్నారు. యూట్యూబ్ స్టార్ గా ఉన్న నువ్వు ఎంతో మంది యూత్ ఫాలింగ్ కలిగి ఉన్నావు. అలాంటి నువ్వు యువతకు ఇలాంటి సందేశాలిస్తావా అంటూ నెటిజెన్స్ షణ్ముఖ్ జస్వంత్ ని ఓ ఆట ఆడుకుంటున్నారు. సోషల్ మీడియా స్టార్ గా ఉన్న షణ్ముఖ్ జస్వంత్ ఇప్పుడు అదే సోషల్ మీడియాలో నెటిజెన్స్ చేతిలో అడ్డంగా బుక్ అయ్యాడు.