Advertisement
Google Ads BL

బాలయ్య ఫ్యాన్స్ కి భారీ ట్రీట్


బోయపాటి - బాలయ్య కాంబోలో తెరకెక్కుతున్న BB3 (గాడ్ ఫాదర్) లో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.. పవర్ ఫుల్ కేరెక్టర్ లో కనిపిస్తాడు అనేది అందరికి తెలిసిందే. BB3 టీజర్ రిలీజ్ అప్పుడే బాలయ్య చెయ్యబోతున్న పవర్ ఫుల్ రోల్ మీద అందరికి ఓ ఐడియా వచ్చేసింది. అయితే ఈ సినిమాలో బాలకృష్ణ రెండో గెటప్ మీద కొంత కన్ఫ్యూషన్ ఉంది. ఎందుకంటే ముందుగా బోయపాటి బాలయ్య ని అఘోర గెటప్ లో కొత్తగా చూపించబోతున్నాడని అనుకున్నారు. రామోజీ ఫిలిం సిటీలో అఘోర గెటప్ సన్నివేశాల షూటింగ్ జరిగినట్టుగా ప్రచారం జరిగింది.

Advertisement
CJ Advs

అయితే లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్ ప్రకారం బాలకృష్ణ BB3 లో గాడ్ ఫాదర్ గా 70 ఏళ్ళ వృద్ధుడి గెటప్ లో కనిపించబోతున్నాడని, అసలు BB3 లో బాలయ్య సెకండ్ గెటప్ ఏమిటి అనేది బాలయ్య ఫాన్స్ కి కూడా అంతుబట్టడం లేదు. కాకపోతే బాలయ్య ఏ గెటప్ లో కనిపిస్తాడు, ఎలాటి కేరెక్టర్ చెయ్యబోతున్నారు అనేది బాలయ్య అభిమానులు ఊహిస్తున్న విషయం. బోయపాటి - బాలయ్య కూడా BB3 లో సెకండ్ గెటప్ విషయం రివీల్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం సెకండ్ గెటప్ కి సంబందించిన సన్నివేశాల చిత్రీకరణ మొదలయ్యింది. షూటింగ్ లోకి ఎవరిని సెల్ ఫోన్ తో ఎలవ్ చెయ్యడం లేదు.

ఎట్టి పరిస్థితుల్లోను బాలయ్య బాబు సెకండ్ గెటప్ కానీ కేరెక్టర్ కానీ BB3 రిలీజ్ వరకు ఎవరికీ తెలియకూడదు అనేది బోయపాటి ఇంటెన్షన్. మొత్తానికి బాలయ్య బాబు చేస్తున్నసెకండ్ గెటప్ బాలయ్య ఫాన్స్ కి భారీ ట్రీట్ ఇవ్వబోతుంది.

A huge treat for Balayya fans:

BB3 Special treat 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs