Advertisement
Google Ads BL

ఈ ఫ్రైడే డ్రైడే అయిపోయిందిగా


2021 క్యాలెండర్ స్టార్ట్ అయినదగ్గరనుండి ప్రతి ఫ్రైడే కోసం చాలా సినిమాలు ఎదురు చూస్తూనే ఉన్నాయి. రిలీజ్ డేట్ కోసం తంటాలు పడుతూనే ఉన్నారు నిర్మాతలు. ఈ ప్రాసెస్ లో భాగంగానే నిన్న శుక్రవారం ఏడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. నితిన్ చెక్ మూవీ దగ్గరనుండి నందిత శ్వేతా అక్షర, క్షణ క్షణం, నిన్నిలా నిన్నిలా, అంగుళీక‌, ఎం.ఎం.ఓ.ఎఫ్ లాంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కానీ అందులో ఏ సినిమా సరైనది లేదు. ప్రతి శుక్రవారం ఏదో ఒక సినిమా వర్కౌట్ అవుతూ వచ్చింది. కానీ ఈ ఫ్రైడే ఏది వర్కౌట్ కాలేదు.. ఈ ఫ్రైడే డ్రై డే గా మిగిలిపోయింది.

Advertisement
CJ Advs

నిన్న రిలీజ్ అయిన మూవీస్ లో చెప్పుకోదగ్గ మూవీ నితిన్ - చంద్ర శేఖర్ యేలేటి కాంబోలో తెరకెక్కిన చెక్ మూవీ ఒక్కటే. చెక్ రిలీజ్ కి ముందు నుండి కూడా నితిన్ రంగ్ దే కున్న క్రేజ్ చెక్ మూవీ కి లేకుండా పోయింది. ప్రోపర్ బజ్ క్రియేట్ అవ్వలేదు. చెక్ మూవీ కి ప్రేక్షకుల నుండి మిక్స్డ్ రెస్పాన్స్ రావడంతో అనుకున్న ఓపెనింగ్స్ కూడా రాలేదు. కేవలం ఫస్ట్ డే మూడు కోట్లతో చెక్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రెండో రోజు అంటే ఈ శనివారం.. మొదటి రోజు కలెక్షన్స్ తో పోలిస్తే సగానికి సగం పడిపోయింది. అంటే కేవలం ఒకటిన్నర కోట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక మూడో రోజు అంటే సండే మాత్రం మ్యాగ్జిమమ్ చెక్ మూవీకి ఓ రెండు కోట్లు వచ్చే అవకాశం ఉంది. 

ఓవరాల్ గా ఈ త్రీ డేస్ తోనే ఎండ్ అయిపోయినట్టే. అంటే చెక్ మూవీ థియేట్రికల్ రన్ ఈ వీకెండ్ తో ఎండ్ అయిపోయినట్లే. కానీ చెక్ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 16 కోట్లు రావాల్సి ఉంది. కానీ చెక్ మూవీ ఈ వీకెండ్ తో కలెక్షన్స్ క్లోజ్ చేసుకోవాల్సి వచ్చేలా ఉంది. అటు డిస్ట్రిబ్యూటర్స్, ఇటు నిర్మాతలకు కూడా భారీ నష్టాలను చెక్ చవి చూపించబోతుంది.

As if this Friday was a dry day:

These Friday movies failed to impress the audience
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs