శ్రీవిష్ణు అంటే మాటలో యాస, భాషలోనే కామెడీ దొర్లుతుంది. బ్రోచేవారెవరురా అంటూ కామెడీ తో హిట్ కొట్టిన శ్రీ విష్ణు మరోసారి రాజేంద్ర ప్రసాద్ తో కలిసి గాలి సంపత్ గా వస్తున్నాడు. కామెడీకి కామెడీ, ఎమోషనల్ కి ఎమోషనల్ ఇది శ్రీ విష్ణు ప్రత్యేకత. ఫేస్ లో ఎక్సప్రెషన్స్ విషయంలో శ్రీ విష్ణు పలికించే హావభావాలు అదుర్స్ అనే రేంజ్ లో ఉంటాయి అతని గత చిత్రాలు చూస్తే. అలాంటి శ్రీ విష్ణు కామెడీ హీరో రాజేంద్ర ప్రసాద్ తో కలిసి చేసిన సినిమా గాలి సంపత్. రాజమౌళి చేతుల మీదుగా విడుదలైన గాలి సంపత్ ట్రైలర్ లో రాజేంద్ర ప్రసాద్ కి నోరు తెలిస్తే గాలి తప్ప మరేదీ రాదు.. ఫ.. ఫ.. ఫీ.. ఫా అంటూ రాజేంద్ర ప్రసాద్ చేసే గాలి భాషను కమెడియన్ సత్య ఎబ్రివేషన్లు, తండ్రిని అనుమానించే కొడుకు.. అలాగే శ్రీ విష్ణు బరువైన డైలాగ్స్.. పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు చాలా ఓపిగ్గా, ప్రేమగా కరెక్ట్ చేస్తారు. అదేంటో కాస్త మీసాలొచ్చేసరికి.. పెద్దోళ్లు ఏం చేసినా, ఊరికే చిరాకులు వచ్చేస్తాయి.. కోపాలు వచ్చేస్తాయి. నేను కూడా మానాన్నని కాస్త ఓపిగ్గా, ప్రేమగా అడగాల్సింది సార్, అలాగే ఏ తండ్రైన కొడుకు ఎదగాలనుకుంటాడు.. కానీ నువ్వెంటి నాన్నా నన్ను తొక్కేసి నువ్వు ఎదగాలనుకుంటున్నావ్ అనే శ్రీ విష్ణు డైలాగ్ వింటే.. తండ్రి కొడుకుల మధ్యన ఉన్న గ్యాప్ అర్ధమవుతుంది.
ఇక హీరోయిన్ తోనూ శ్రీ విష్ణు ప్రతి అమ్మాయికీ డబ్బున్నోడు కావాలి.. లేకపోతే ఫారిన్ వాడు కావాలి.. డబ్బున్నోడు ఏం ఇస్తాడండీ? డబ్బే ఇస్తాడు. టైమ్ ఎక్కడి నుంచి ఇస్తాడు అంటూ కాలం విలువను తెలియజెప్పే డైలాగ్ బావుంది. అయితే అనిల్ రావిపూడి సమర్పణలో తెరకెక్కిన గాలి సంపత్ లో అనిల్ రావిపూడి మార్క్ కామెడీ కనిపిస్తుంది. కామెడీ ఒక్కటే కాదు.. ఎమోషనల్ గాను ఉంది. అలాగే తండ్రి కొడుకుల అనుబంధం, వాళ్ళ మధ్యన ఏర్పడిన అగాధం అన్ని ఎమోషనల్ గాను కనెక్ట్ అవుతున్నాయి. అలాగే మధ్యలో థ్రిల్లర్ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. మరి మార్చి 11 న విడుదల కాబోతున్న గాలి సంపత్ ట్రైలర్ చూస్తుంటే శ్రీ విష్ణు మరో మారు హిట్ కొట్టేలాగే కనిపిస్తున్నాడు.
Click Here to: >Gaali Sampath Trailer