Advertisement
Google Ads BL

శంకర్-చరణ్ మూవీలో కోలీవుడ్ హీరో సూర్య


సన్సేషనల్ డైరెక్టర్ శంకర్ - టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ కాంబోలో టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోయే పాన్ ఇండియా ఫిలిం రీసెంట్ గానే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. రామ్ చరణ్ తో శంకర్ చెయ్యబోయే పాన్ ఇండియా మూవీలో మరో హీరో ఉండబోతున్నాడని.. అది ఒక బడా మల్టీస్టారర్ గా తెరకేకించే ప్లాన్ లో శంకర్ ఉండబట్టే దిల్ రాజు రిస్క్ చేస్తున్నట్లుగా మీడియా టాక్. అయితే రామ్ చరణ్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించే ఛాన్సెస్ ఉన్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దాదాపుగా పవన్ కళ్యాణ్ - రామ్ చరణ్ కాంబోలోనే శంకర్ మల్టీస్టారర్ ఉండబోతుంది అనుకున్నారు. కానీ తాజాగా శంకర్ - రామ్ చరణ్ మూవీ లోకి మరో స్టార్ హీరో ఎంటర్ అవుతున్నారు.

Advertisement
CJ Advs

అది ఎవరో కాదు.. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. సూర్య, రామ్ చరణ్ - శంకర్ మూవీ లో వన్ అఫ్ ద హీరోగా నటించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఆకాశం నీ హద్దురా సినిమా హిట్ తో ఊపు మీదున్న సూర్య వరస సినిమాలతో బిజీగా వున్నారు. అయినా శంకర్ మూవీ అనేసరికి సూర్య డేట్స్ అడ్జెస్ట్ చేసుకుని ఈ పాన్ ఇండియా మూవీకి ఓకె చెప్పేసాడనే టాక్ మొదలయ్యింది. సూర్య సినిమాలకు తెలుగులోనూ మంచి మర్కెట్ ఉంది. అలా అటు కోలీవుడ్ ని ఇటు టాలీవుడ్ ని.. మిగతా భాషలను టార్గెట్ చేస్తూ శంకర్ తన మాయాజాలాన్ని చూపించబోతున్నారు. మరి రామ్ చరణ్ కూడా RRR తో పాన్ ఇండియా మూవీలోకి అడుగుపెడుతున్నాడు. దానితో రామ్ చరణ్ క్రేజ్ మరియు రేంజ్ పెరుగుతాయి. సౌత్ నెంబర్ వన్ డైరెక్టర్ శంకర్ తో RRR హీరో రామ్ చరణ్, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కలిసి భారీ బడ్జెట్ లో పాన్ ఇండియా రేంజ్ మూవీ అంటే ఆ సినిమాపై అంచనాలు ఊహించుకోవడానికే కష్టం.

Ram Charan - Hero Surya in Shankar movie:

Kollywood hero Surya in Shankar-Charan movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs