Advertisement
Google Ads BL

అందనంత ఎత్తులో ప్రభాస్


ప్రభాస్ ప్రస్తుతం సౌత్ నెంబర్ వన్ హీరోగా ఎదుగుతున్నారు. ఎందుకంటే వరస పాన్ ఇండియా మూవీస్ తో ఇంతవరకు ఏ హీరో చెయ్యని సాహసం ప్రభాస్ చేస్తున్నారు. బాహుబలి తో వరల్డ్ వైడ్ క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్  అదే క్రేజ్ తో వరస పాన్ ఇండియా మూవీస్ ని లైన్ లో పెట్టారు. సాహో తో కాస్త జంకినా.. మళ్ళీ రాధేశ్యామ్ అలాగే.. సాలార్, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ మూవీస్ తో ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఎప్పుడూ ఒకే సినిమాతో నానుస్తూ ఉండే ప్రభాస్ ప్రస్తుతం నాలుగు పాన్ ఇండియా మూవీస్ తో బాగా బిజీ అయ్యారు. రాధాకృష్ణ తో రాధేశ్యామ్ ఫినిష్ చేసిన ప్రభాస్.. కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సలార్, అలాగే బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తో ఆదిపురుష్ సినిమాల షూటింగ్స్ తో బిజీగా వున్నారు. ఆదిపురుష్ కోసం గత నాలుగు నెలలుగా స్పెషల్ జిమ్ అలాగే హిందీ భాషలో పట్టు కోసం శిక్షణ తీసుకుంటున్నారు ప్రభాస్.

Advertisement
CJ Advs

మరి నాలుగు పాన్ ఇండియా మూవీస్ తో లెవల్ పెరిగిన ప్రభాస్ పారితోషకం కూడా అదే రేంజ్ లో పెరిగినట్లుగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ హల్ చల్ చేస్తుంది. రాధాకృష్ణ రాధేశ్యామ్ కోసం 70 కోట్ల వరకు అందుకుంటున్న ప్రభాస్ అటు ఆదిపురుష్ ఇటు నాగ్ అశ్విన్ మూవీస్ కి తలో 100 కోట్ల పారితోషకం అందుకోబోతున్నాడనే న్యూస్ మొదలయ్యింది. ఈ దెబ్బకి బాలీవుడ్ ఖాన్ త్రయానికి చమట్లు పట్టడం ఖాయమని, ఇక సాలార్, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ మూవీస్ గనక సూపర్ హిట్స్ అయితే ప్రభాస్ రేంజ్ మరింత పెరగడం ఖాయమని అంటున్నారు. దానితో ప్రభాస్ రేంజ్ ని అందుకోవడం బాలీవుడ్ హీరోల తరం కాదని.. భారీ బడ్జెట్ మూవీస్ తో ప్రభాస్ ఇప్పటికే అందరికి అందనంత ఎత్తులో ఉన్న విషయం తెలిసిందే.

Prabhas Hikes Remuneration?:

Prabhas hikes remuneration big time! Charging Rs 100 Cr per movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs