ప్రస్తుతం ఏపీలో వైసీపీ రాజ్యం నడుస్తుంది. టీడీపీ హవా మెల్ల మెల్లగా తగ్గుతుంది. జగన్ ప్రభుత్వం పై విమర్శలు చేసిన టిడిపి నాయకులు ఒక్కొక్కరిగా జైలుకెళ్ళడంతో.. మిగతా టిడిపి నాయకులు సైలంట్ గా ఉంటున్నారు తప్ప పోరాటానికి సిద్ధపడడం లేదు. మరోపక్క రీసెంట్ గా చంద్రబాబు అడ్డా కుప్పంలో టిడిపి పంచాయితీ ఎన్నికల్లో ఓడిపోవడం.. అక్కడ వైసీపీ జెండా పాతడంతో అలెర్ట్ అయిన చంద్రబబు నాయుడు వెంటనే కుప్పం పర్యటనకు బయలు దేరారు. అయితే కుప్పంలో పర్యటిస్తున్న చంద్రబాబుకి ఓ విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. అదేమిటంటే.. కుప్పం తెలుగు దేశం కార్య కర్తలు చంద్రబాబుని ఓ కోరిక కోరారు. అది జూనియర్ ఎన్టీఆర్ తో టిడిపికి ప్రచారం చేయించమంటూ చంద్రబాబుని కోరడంతో ఆయన సైలెంట్ గా తలూపారు తప్ప హామీ ఇవ్వలేదు.
గతంలో జూనియర్ ఎన్టీఆర్ టిడిపి తరుపున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. తర్వాత ఎన్టీఆర్ సినిమాల్లో బిజీ అవడం టిడిపికి దూరంగా మసలడం.. అలా అలా ఎన్టీఆర్ రాజకీయాలకు చాలా దూరంగానే ఉంటున్నారు. మధ్య మధ్యలో ఎన్టీఆర్ టాపిక్ టీడీపీలో వినబడుతూనే ఉంది. ఎన్టీఆర్ టీడీపీ పార్టీలో జాయిన్ అయితే బావుంటుంది అనే మాట వినబడినా ఆ విషయంపై అటు చంద్రబాబు గాని ఇటు ఎన్టీఆర్ కానీ ఎప్పుడు స్పందించలేదు. మరి తాజాగా ఏపీలో టీడీపీ పరిస్థితి మరీ అగమ్య గోచరంగా కనిపిస్తుండడంతో టీడీపీ కార్యకర్తల్లో అసహనం పెరిగి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని టీడీపీ తరుపున దింపమంటూ యంగ్ టిడిపి కార్యకర్తలు చంద్రబాబు పై ఒత్తిడి పెంచుతున్నారు.