Advertisement
Google Ads BL

ఆస్కార్ బరిలో ఆకాశం నీ హద్దురా


కరోనా క్రైసిస్ వలన థియేటర్స్ లో విడుదల కావాల్సిన సూర్య ఆకాశం నీ హద్దురా(సూరారై పొట్రు) ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. అంతకు ముందు ప్లాప్ లతో కొట్టుమిట్టాడిన సూర్య కి ఆకాశం నీహద్దురా సినిమా ఊపిరి పోసింది. అద్భుతమైన టాక్ తో ఆకాశం నీ హద్దురా సూపర్ హిట్ అయ్యింది. సామాన్యుడు రూపాయికే విమానం ఎక్కాలనే కలను నిజం చేసిన గోపినాధ్ బయోపిక్ గా ఈ సినిమా తెరకెక్కింది. హీరో గా సూర్య, హీరోయిన్ గా అపర్ణ బాలమురళి, దర్శకురాలిగా సుధా కొంగర, మ్యూజిక్ డైరెక్టర్ అందరూ ఎవరి పని వారు అద్భుతంగా చేసారు. సూర్య ఆకాశం నీ హద్దురా పెరఫార్మెన్స్ కి అందరూ ఫిదా అయ్యారు. 

Advertisement
CJ Advs

అందరి చేత శెభాష్ అనిపించుకున్న ఈ సినిమా ఎంతో ప్రతిష్ఠమకమైన ఆస్కార్ బరిలోకి నిలిచిన విషయం తెలిసిందే. జనరల్ కేట‌గిరీలో బెస్ట్ డైరెక్ట‌ర్, బెస్ట్ యాక్ట‌ర్, బెస్ట్ యాక్ట్రెస్ తో పాటు ప‌లు కేట‌గిరిల్లో ఈ చిత్రం ఆస్కార్ పోటీకి సిద్ధ‌మైంది. ఈ క్ర‌మంలో తాజాగా బెస్ట్ పిక్చ‌ర్ నామినేష‌న్‌కి ఆకాశం నీహద్దురా నామినేట్ అయ్యింది. మొత్తం 366 చిత్రాల‌ను నిర్వాహ‌కులు ఎంపిక చేయ‌గా.. అందులో ఇండియా నుంచి సూర్య నటించిన సూరారై పొట్రు కూడా నిలిచింది. ఈ మూవీకి ఓటింగ్ మార్చ్ 5 నుండి జరగనుంది. అంతేకాకుండా సూర్య, అపర్ణ బాలమురళి.. ఉత్తమ నటీనటుల కేటగిలో ఉన్నారు. మరి ఈసారైనా మన సౌత్ మూవీకి ఆస్కార్ అవార్డు రావాలంటూ సూర్య ఫాన్స్ కోరుకుంటున్నారు.

Soorarai Pottru Enters Oscars:

Suriya Soorarai Pottru joins Oscar race
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs