Advertisement
Google Ads BL

క్రిష్ - పవన్ PSPK 27 లీకెడ్ పిక్


పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఏకే రీమేక్ షూటింగ్ కి తాత్కాలిక బ్రేక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ క్రిష్ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యారు. అటు రాజకీయాల పరంగా పంచాయితీ ఎన్నికల్లో ఉనికి చాటుకున్న జనేసేన పార్టీ మున్సిపల్ ఎలక్షన్స్ విషయంలో కోర్టుకు వెళ్ళింది. అయితే క్రిష్ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ నగర శివార్లలోని స్పెషల్ గా వేసిన గండికోట సెట్స్ లో జరుగుతుంది. క్రిష్ - పవన్ కళ్యాణ్ కాంబో టైటిల్ గా హరిహర వీరమల్లు అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే మార్చ్ 11 మహా శివరాత్రి కి క్రిష్ మూవీ టైటిల్ తో పాటుగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తామంటూ ప్రకటించింది టీం.

Advertisement
CJ Advs

మరి ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తామని టీం చెప్పిందో లేదో ఇలా క్రిష్ మూవీ షూటింగ్ నుండి పవన్ కళ్యాణ్ లుక్ లీకైంది. PSPK 27 లో పవన్ కళ్యాణ్ ఎలాంటి కేరెక్టర్ చెయ్యబోతున్నాడో.. ప్రస్తుతం పైన కనబడుతున్న లీక్డ్ పిక్ చూస్తే తెలుస్తుంది. వీరమల్లుగా పవన్ ఎలా ఉంటాడో అనేది ఈ పిక్ తో ఓ క్లారిటీ వచ్చేసింది. క్రిష్ సినిమాకు సంబంధించి కొన్ని పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ లీకెడ్ పిక్స్ లో పవన్ కళ్యాణ్ పాతబస్తీకి చెందిన పహిల్వాన్లతో కుస్తీ చేసే సీన్లు షూట్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది.  మరి హరిహర వీరమల్లు గా పవన్ ఎలా ఉండబోతున్నాడో అనేది మార్చి 11 వరకు సస్పెన్స్ లో పెట్టి ఊరిద్దామనుకున్న టీం కి ఇలా లీకుల రాయుళ్లు పవన్ లుక్ లీక్ చేసి షాకిచ్చారు. ప్రస్తుతం పవన్ - క్రిష్ కాంబో లీకెడ్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Krish - Pawan PSPK 27 Leaked Pic:

Pawan Kalyan From The Sets Of PSPK27 leaked pics viral
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs