Advertisement
Google Ads BL

శ్రీదేవి తర్వాత స్థానం తనదేనట


శ్రీదేవి ఎంత పెద్ద మహానటో.. ఆమెకున్న గౌరవం, ఆమె కున్న క్రేజ్ ఎలాంటిదో అందరికి తెలిసిందే. శ్రీదేవి లా నటించాలంటే మాములు విషయం కాదు. అటు సీరియస్ పాత్రల్లోనూ, ఇటు కామెడీ పాత్రల్లోనూ శ్రీదేవి ని కొట్టిన వారు లేరు. శ్రీదేవి ఓ స్పెషల్ అంతే. మరి అలాంటి శ్రీదేవి నటన తర్వాత స్థానం తనదే అంటుంది ఓ బాలీవుడ్ హీరోయిన్. ఆమె ఎవరో కాదు రెబల్ హీరోయిన్ కంగనా రనౌత్. ఏదైనా స్ట్రయిట్ గా మాట్లాడగల సత్తా ఉన్న హీరోయిన్, ఎవరిని లెక్క చెయ్యని కంగనా రనౌత్. బాలీవుడ్ లో తను వెడ్స్ మను, క్వీన్, మణికర్ణికా సినిమాలతో విపరీతమైన క్రేజ్ దక్కించుకుని.. బాలీవుడ్ స్టార్ హీరోలను, బడా దర్శకనిర్మాతలు ఓ రేంజ్ లో ఆడుకుంటుంది.

Advertisement
CJ Advs

అంతేకాదు మహారాష్ట్ర సర్కార్ శివసేనతో ఢీ అంటే ఢీ అంటుంది కంగనా. అయితే కంగనా రనౌత్ నటించిన తను వెడ్స్ మను సినిమా రిలీజ్ అయ్యి పదేళ్లు అయిన సందర్భంగా కంగనా రనౌత్ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. శ్రీదేవి తర్వాత మళ్ళీ ఆ  స్థాయిలో కామెడీ పాత్రల్లో నటించగల సామర్థ్యం తనకు మాత్రమే సొంతమని.. నాలా మరెవ్వరూ చెయ్యలేరంటుంది కంగనా. శ్రీదేవి తర్వాత ఆ స్థాయిలో కామెడీ గా నటించింది తానేనని.. తను వెడ్స్ మను కంటే ముందు తాను ఒకే రకమయిన పాత్రలకు పరిమితమయ్యా అని.. కానీ తను వెడ్స్ మను తన కెరీర్ ని మార్చేసిన చిత్రమంటూ చెప్పుకొచ్చింది. .

Kangana says the position after Sridevi is her own:

Kangana Ranaut says Tanu Weds Manu changed her career
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs