Advertisement
Google Ads BL

ఫ్రైడే విన్నర్ ఎవరో..?


లాక్ డౌన్ తో తొమ్మిదినెలలు మూతబడిన థియేటర్స్ మళ్ళీ ఓపెన్ అవడం.. థియేటర్స్ ఓపెన్ అయ్యాక ప్రతి వారం సినిమాల మీద సినిమాలు ప్రేక్షకుల మీద దాడి చేస్తున్నాయి. అందులో ఒకటో రెండో మాత్రమే ప్రేక్షకాదరణ చూరగొంటున్నాయి. సంక్రాంతికి పొలోమని కాస్త పేరున్న సినిమాలు రిలీజ్ అయినా అందులో క్రాక్ ఒక్కటే నిలబడగలిగింది. ఇక తర్వాత 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, జాంబీ రెడ్డి సోలోగా రిలీజ్ అయినా అవి హిట్ అవ్వలేదు. తర్వాత ఉప్పెన సినిమా సోలోగా దిగి భారీ హిట్ కొట్టింది. స్టిల్ ఇప్పటికి ఉప్పెన హవా కొనసాగుతుంది. 

Advertisement
CJ Advs

ఇక గత వారం విడుదలైన నాలుగు సినిమాల్లో నాంది పాజిటివ్ టాక్ తో పాజిటివ్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. నాంది టీం థియేటర్స్ కవరేజ్, నాంది ప్రమోషన్స్ అలాగే మౌత్ టాక్ తో నాంది కలెక్షన్స్ పుంజుకుంటున్నాయి. ఇక ఈ వారం కూడా పొలోమంటూ సినిమాలు థియేటర్స్ కి క్యూ కడుతున్నాయి. అందులో నితిన్ చెక్, అక్ష‌ర‌, అంగుళీక‌, క్ష‌ణం క్ష‌ణం, నువ్విలా నువ్విలా, ఎం.ఎం.ఓ.ఎఫ్, ఏప్రిల్ 28 ఏమి జరిగింది?, లాయర్ విశ్వనాధ్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అన్నిటిలో నితిన్ చెక్ మీదే అందరిలో ఆసక్తి అంచనాలు ఉన్నాయి. నితిన్ చెక్ ప్రమోషన్స్ కూడా అదే రేంజ్ లో ఉన్నాయి. చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ - ప్రియా ప్రకాష్ వారియర్ - రకుల్ కలిసి నటించిన చెక్ మీద అందరిలో ఇంట్రెస్ట్ ఉంది. 

ఇక తర్వాత నందితా శ్వేతా మెయిన్ లీడ్ లో నటించిన అక్షర మీద కాస్త ఆసక్తి ఉంది. ఎందుకంటే చెక్ కి పోటీగా అక్షర ప్రమోషన్స్ ఉన్నాయి. ఇక మిగిలిన సినిమాలు విషయంలో ప్రేక్షకులకు ఎలాంటి క్లారిటీ లేదు. మరి రేపు శుక్రవారం విన్నర్ ఎవరో ఈ టైం కల్లా క్లారిటీ వచ్చేస్తుంది. 

Who is the Friday winner?:

This friday release movies in tollywood
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs