Advertisement
Google Ads BL

లీకెడ్ పిక్స్ : ఒకే ఫ్రేమ్ లో చిరు - చరణ్


సినిమా రిలీజ్ అయ్యాక జరిగే పైరసీనే అరికట్టలేక తల పట్టుకుంటుంటే.. అసలు సినిమాల షూటింగులనే సరిగా సాగనివ్వం అంటున్నారు లీకు వీరులు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్ ఫోన్ ఉండటం అనేది పాలిటిక్స్ లో కరెప్షన్ అంత కామన్ అయిపోవడంతో ఎక్కడ పడితే అక్కడ కెమెరాలు క్లిక్కుమంటున్నాయి. సెలెబ్రిటీలు కనిపిస్తే చాలు సెల్ఫీ అంటున్నారు.. వీలుంటే వీడియోలు లేదంటే ఫోటోలు తీసేస్తూ తమ చరవాణిని వాడే పనిలోనే ఉంటున్నారు. అక్కడితో ఆగితే పర్లేదు... వాటిని వాళ్ళే దాచుకుంటే ప్రాబ్లమే రాదు. కానీ నేటి కుర్రకారుకి సోషల్ మీడియా అనే ఫ్లాట్ ఫామ్ ఒకటి ఫ్రీగా దొరకడంతో సినిమా వాళ్ళ గుట్టుని పట్టుకొచ్చి నెట్టింట్లో పెట్టేస్తున్నారు. అదేదో గొప్ప ఘనకార్యం అనుకుంటున్నారు. 

Advertisement
CJ Advs

మొన్నటికి మొన్న పుష్ప సినిమా షూటింగ్ జరుగుతుండగా ఎవరో ఆకతాయి తీసిన ఫోటోలు, వీడియో క్లిప్పింగులు సోషల్ మీడియాలోకి వచ్చేసాయి.. చకచకా చక్కర్లు కొట్టేశాయి. ఇక ఈ రోజు ఆచార్య వంతు. మెగాస్టార్ చిరంజీవిని - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని ఒకే ఫ్రేమ్ లో చూడాలని, వాళ్ళిద్దరి స్క్రీన్ షేరింగ్ ని ఎంజాయ్ చెయ్యాలని అందరూ తహతహలాడుతూ ఉంటే షూటింగ్ లొకేషన్ లో వాళ్లిద్దరూ కలిసి ఉన్న పిక్స్ ని తీసుకొచ్చి నేడు మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ చేసేసారు. అయితే క్లియర్ గా రామ్ చరణ్ చూస్తూ ఉండగానే తీసినట్టు ఉన్న ఈ ఫోటోలు ఇలా బయటికి వచ్చేస్తాయని తాను ఊహించాడో లేదో.! నమ్మకస్తుడే కదా అనుకున్నాడో లేక మొహమాటానికి పోయాడో మొత్తానికైతే చరణ్ ఫోజులిచ్చి మరీ తీయించుకున్న ఈ పిక్స్ మాత్రం మెగా ఫాన్స్ కి మంచి కిక్కే ఇచ్చాయి. చిరు - చరణ్ లు చూడ్డానికి బ్రదర్స్ లా ఉన్నారని కామెంట్స్ చేసుకుంటూ ఆచార్య పైన మరిన్ని అంచనాలు పెంచేసుకుంటున్నారు అభిమానులు.!

chiru - charan in a single frame:

chiru with charan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs