బాలీవుడ్ లో అయితే ఒకరి సినిమాని ఒకరు అప్రిషేట్ చేసుకునేందుకే అహం అడ్డొస్తుంటుంది. కానీ మన టాలీవుడ్ లో మాత్రం ఏ సినిమా బావున్నా ఒకరినిఒకరు అభినందించుకుంటూ, భుజం తట్టుకుంటూ ముందుకు వెళ్లడం అభినందించదగిన విషయం. అందులోనూ పెద్ద పెద్ద స్టార్ హీరోలు కూడా చిన్న చిన్న సినిమాలను ఎంకరేజ్ చెయ్యడం ఇంకా అభినందించాల్సిన విషయం. రీసెంట్ గా ఉప్పెన చూసిన మహేష్ బాబు ట్వీట్ల వర్షం కురిపించారు. మాములుగా అయితే మహేష్ లాంటి సూపర్ స్టార్ సినిమా చూసి.. సినిమా బావుంది అని ఓ ట్వీట్ పెట్టి కంగ్రాట్స్ టూ యూనిట్ అంటే సరిపోయేది. అలా కాకుండా ఉప్పెనలా వరస ట్వీట్స్ కురిపించడం అనేది అందరిని విస్మయానికి గురిచేసింది.
మాములు అభిమానులకే కాకుండా.. ఉప్పెన యూనిట్ మెంబెర్స్ కూడా షాకయ్యారు.. మహేష్ పెట్టిన వరస ట్వీట్స్ చూసి. ఉప్పెన సినిమాని క్లాసిక్ గా అభివర్ణించిన మహేష్ బాబు, పేరు పేరునా అంటే.. ఆ సినిమాలో నటించిన హీరో, హీరోయిన్, దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ ఇలా అందరిని అభినందించడం విశేషం. మహేష్ ట్వీట్స్ కి అలానే స్పందించింది ఉప్పెన యూనిట్ కూడా. ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి అయితే.. సూపర్ స్టార్ మహేష్ సర్ మమ్మల్ని స్టార్స్ అనడం అనేది లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది అంటూ పొంగిపోయింది. హీరో వైష్ణవ్ తేజ్ అలాగే హీరో అన్న సాయి ధరమ్ తేజ్ లు ఇద్దరూ కూడా థాంక్యూ మహేష్ అన్నా అంటూ ట్విట్టర్ లో థాంక్స్ చెప్పుకున్నారు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ కూడా మహేష్ వేసిన ట్వీట్ కి ఎంతెలా పొంగిపోయి ట్వీట్ చేసాడో చూసాం. మరి మహేష్ అలా వరస ట్వీట్స్ కి ఉప్పెన టీమ్ ఇలా పొంగిపోయింది.