Advertisement
Google Ads BL

బాలయ్యతో తొడ కొట్టిస్తాడట


సెవెంటీ ఎం ఎం స్క్రీన్ పై నందమూరి బాలయ్య.. తొడ కొడితే ఎలా ఉంటుందో అందరికి తెలుసు. మరి బాలయ్య తొడ కొట్టి చాలా కాలం అయ్యిపోయింది. అలాంటి సూపర్ సీన్స్ చూసి చాలా రోజులు అవుతుంది. మరి ఇప్పుడు మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని, బాలయ్య లోని హీరోయిజం మళ్ళీ చూపించి ఆయనతో తొడ కొట్టిస్తానంటున్నాడు. ఈమధ్యనే రవితేజ తో అదిరిపోయే మాస్ హిట్ కొట్టిన గోపీచంద్ మలినేని.. సంక్రాంతికి క్రాక్ సినిమాని విడుదల చేసి హిట్ కొట్టిన విషయం తెలిసిందే. క్రాక్ తర్వాత నెక్స్ట్ మూవీ బాలయ్యతో చెయ్యబోతున్న విషయమూ తెలిసిందే. అది కూడా పవర్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ మూవీ చేయబోతున్నాడనే టాక్ నడుస్తుంది. 

Advertisement
CJ Advs

మరి బాలయ్య మూవీ వస్తుంది అంటే.. నందమూరి అభిమానులు అందులో అదిరిపోయే పవర్ ఫుల్ సీన్స్ ఊహించేసుకుంటారు. బిగ్ స్క్రీన్ పై నందమూరి నటసింహం బాలయ్య తొడ కొట్టడం, విలన్ పై పంచ్ డైలాగ్ వేస్తూ గాండ్రించడం లాంటివి ఊహించేసుకుంటారు. అలాంటి సీన్స్ కేవలం బాలయ్య అభిమానులకే కాదు సినిమా అభిమానులందరికి ఇష్టమే. మరి చాలా రోజుల తరువాత మళ్ళీ బాలయ్య ను ఆ రేంజ్ లో చూపిస్తానని అంటున్నాడు గోపీచంద్ మలినేని. రీసెంట్ గా బాలకృష్ణ ని కలిసి అదిరిపోయే స్టోరీ చెప్పాడట. ఆ కథ విని బాలయ్య కూడా ఇంప్రెస్ అవడం బోయపాటి BB3 తర్వాత వెంటనే గోపీచంద్ మూవీని బాలయ్య పట్టాలెక్కించడానికి రెడీ అవుతున్నారట. BB3 లోనే కాదు ఈ సినిమాలో బాలయ్య మళ్ళీ ఫ్యాక్షన్ లోకి దిగనున్నాడని సమాచారం. 

Talk about making a Powerful Mass Entertainer movie from Balayya-Gopichand Malineni:

Talk about making a Powerful Mass Entertainer movie 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs