Advertisement
Google Ads BL

ఈ పాప కూడా ఊపు మీదే ఉంది.!


అందాల ఉప్పెనలా అందరిని ఆకర్షించేసిన కృతి శెట్టి గురించే నిన్నమొన్నటివరకు మనం మాట్లాడుకున్నాం. ఫస్ట్ సినిమా రిలీజ్ కాకముందే మరో రెండు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది అని.. ఇంకో రెండు మూడు సినిమాల ఆఫర్స్ రెడీ గా ఉన్నాయని తన గురించి చాలా చెప్పుకున్నాం. ఇప్పుడు ఇదే బాటలో ఇంకో పాప కూడా మంచి ఊపు మీదుందండోయ్. ఆమె ఎవరో కాదు ప్రియా ప్రకాష్ వారియర్. వింక్ మూమెంట్ తో ఓవర్ ది నైట్ ఎంటైర్ ఇండియన్ యూత్ ని అట్రాక్ట్ చేసిన ప్రియా ప్రకాష్ వారియర్ కి ఆ ఎక్సప్రెషనే ఎక్కువ గుర్తింపు తీసుకొచ్చింది.. ఆ సినిమా రిజల్ట్ కంటే. అయితే ఆ సినిమా కాస్తా ప్లాప్ అవడంతో రెండేళ్లు సైలెంట్ గా ఉన్న ప్రియా ప్రకాష్ ఎట్టకేలకి టాలీవుడ్ లో నితిన్ హీరోగా తెరకెక్కిన చెక్ సినిమాతో మళ్ళీ తన లక్ టెస్ట్ చేసుకోబోతుంది. 

Advertisement
CJ Advs

నితిన్ చంద్ర శేఖర్ ఏలేటి కాంబోలో వస్తున్న చెక్ మూవీ పై మంచి బజ్ ఉంది. రేపు 26 న చెక్ మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్ కాకుండా మరో హీరోయిన్ కూడా నటించింది. క్రేజీ హీరోయిన్ గా బాలీవుడ్ లో దున్నేస్తున్న రకుల్ చెక్ లో వన్ అఫ్ ద హీరోయిన్. ఇక ఈ సినిమాలో ఉన్న ఒకే ఒక్క పాటలో కావాల్సినంత అందాల విందు వడ్డించేసిన ప్రియా ప్రకాష్ వారియర్ ఇప్పటికే ఇష్క్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. చాలా కాలం తర్వాత సూపర్ గుడ్ ఫిలిమ్స్ వాళ్ళు చేస్తున్న ఇష్క్ మూవీలో తేజ సజ్జా సరసన నటిస్తుంది. ఆ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. 

ఇది కాకుండా సందీప్ కిషన్ హీరోగా మహేష్ కోనేరు నిర్మాతగా తెరకెక్కుతున్న సినిమాకి కూడా ప్రియా ప్రకాష్ హీరోయిన్ గా కమిట్ అయ్యింది. చెక్ సినిమా రిలీజ్ కాకముందే.. మరో రెండు సినిమాలు లైనప్ లో ఉన్నాయి పాపకి. రేపు చెక్ సినిమా టాక్ గనక పాజిటివ్ గా వచ్చింది అంటే పాప ఊపు ఇదే రేంజ్ లో కంటిన్యూ అయ్యేలా ఉంది. అన్నట్టు చెక్ సినిమాలో ప్రియా పాత్ర పేరు యాత్ర. మరి చెక్ సినిమాతో తెలుగునాట ప్రారంభిస్తున్న యాత్ర ఎంతవరకు, ఎలా కొనసాగుతుందో చూద్దాం.

This sin is also on the swing:

Wink girl Priya Prakash bags another offer in Telugu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs