Advertisement
Google Ads BL

ఫ్లాష్ : ప్రభాస్ వర్సెస్ అలియాభట్


జులై 30 న రాధాకృష్ణ - ప్రభాస్ కాంబో లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ఫిలిం రాధేశ్యామ్ రిలీజ్ డేట్ ని ప్రకటించింది. అన్ని భాషల్లో సోలో రిలీజ్ డేట్, ఓపెన్ గ్రౌండ్ పైగా పాన్ ఇండియా ఫిలిం కనుక ప్రభాస్ రేంజ్ కి రాధేశ్యామ్ సినిమాకి అద్భుతమైన ఓపెనింగ్స్ వస్తాయి అనుకుంటే.. దానికి గండి కొట్టేలా రంగంలోకి దిగింది అలియా భట్. అలియా భట్ బాలీవుడ్ లో నటిస్తున్న రీసెంట్ మూవీ గంగూబాయ్ కతియవాది. ఈ సినిమా కూడా జులై 30 నే విడుదల చేస్తున్నట్టుగా ఈరోజే అధికారికంగా డేట్ ప్రకటించింది చిత్ర బృందం. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటి అంటే గంగూబాయ్ కతియవాది దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ కి చాలా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 

Advertisement
CJ Advs

ఒక విలక్షణమైన దర్శకుడిగా బాలీవుడ్ లోనే కాకుండా ఓవర్సీస్ ఆడియన్స్ లో కూడా చాలామంచి క్రేజు, ఇమేజు ఉన్న డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ. బాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న అలియా భట్ ని సెక్స్ వర్కర్ కేరెక్టర్ లో చూపిస్తూ ప్రయోగాత్మకంగా మరియు తనదైన శైలిలో కళాత్మకంగా సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ గంగూబాయ్ కతియవాది పై భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాకుండా అలియా భట్ భారీ బడ్జెట్ మూవీస్ లో అనగా ఆర్.ఆర్.ఆర్ లాంటి పాన్ ఇండియా మూవీ, బ్రహ్మాస్త్ర లాంటి  భారీ మల్టీస్టారర్ మూవీస్ లో నటిస్తుండడంతో.. ఇప్పుడు అలియా భాట్ మూవీస్ అంటే సౌత్ ప్రేక్షకులకు కూడా స్పెషల్ ఇంట్రెస్ట్ కలిగింది. 

అంత క్రేజ్ ఉన్న అలియా భట్, సంజయ్ లీలా ల గంగూబాయ్ కతియవాది, బాహుబలి తో పాన్ ఇండియా లెవల్లో భారీ ఇమేజ్ మూటగట్టుకుని, సాహో తో బాలీవుడ్ లో ప్రభంజనం చూపించిన ప్రభాస్ రాధేశ్యామ్ ఇలా ఒకే రోజు పోటీ పడబోతున్నాయి. మరి ఈ రెండు సినిమాలు బాక్సాఫీసు రెవిన్యుని ఏ రేషియోలో షేర్ చేసుకుంటాయో చూడాలి.  

Flash: Prabhas vs Alia Bhatt:

Alia Bhatt vs Prabhas as Gangubai Kathiawadi to take on Radhe Shyam at the box-office on July 30
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs