నాని లేటెస్ట్ ఫిలిం టక్ జగదీశ్ టీజర్ ఈ రోజే రిలీజ్ అయ్యింది. నాని పుట్టిన రోజు కానుకగా ఒక రోజు ముందే టీజర్ విడుదల చేసింది టక్ జగదీశ్ యూనిట్. నాని రెగ్యులర్ సినిమాల్లా ఫీల్ గుడ్ ఫిలిం లా కాకుండా విలేజ్ నేటివిటీ తో పాటుగా యాక్షన్ మిక్స్డ్ ఫిలిం లా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. నాని క్లాసీ లుక్స్ తో స్టైలిష్ యాక్షన్ తో, అన్న మీద ప్రేమున్న తమ్ముడు, అలాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా టక్ జగదీశ్ టీజర్ ని కట్ చేసారు. అయితే టోటల్ గా టక్ జగదీశ్ టీజర్ కి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. దానితో పాటు టక్ జగదీశ్ టీజర్ కోసం వాడిన బ్యాగ్రౌండ్ సాంగ్ యాజిటీజ్ గా అల వైకుంఠపురములో సినిమాలోని సిత్తరాల సిరపడు పాటని గుర్తు తెచ్చేలా ఉంది అంటున్నారు నెటిజెన్స్.
అల వైకుంఠపురములో క్లయిమాక్స్ ఫైట్ కోసం త్రివిక్రమ్ ఉత్తరాంధ్ర స్లాంగ్ లో సిత్తరాల సిరపడు సాంగ్ రాయిస్తే.. అదే పంథాలో టక్ జగదీశ్ టీం కూడా ట్రై చేశారనిపిస్తుంది. తేడా ఏమిటి అంటే అక్కడ మేల్ వాయిస్ ఇక్కడ ఫీమేల్ వాయిస్. అంతే. పాట మాత్రం దాదాపుగా అదే దారిలో సాగింది. పాట ఒక్కటే కాదండోయ్.. షాట్ కూడా గుర్తొచ్చేలా కోడి పుంజుని పట్టుకుని మరీ కనిపించాడు నాని. దాంతో పాటని, బీటునే కాకుండా చివరికి పుంజుని కూడా భలే గుంజేసారే అంటూ సెటైర్స్ పేలుస్తున్నారు సోషల్ మీడియాలో. అయితే కంపేరిజన్ వచ్చింది ఇండస్ట్రీ హిట్ సినిమాతోనే కనుక టక్ జగదీష్ టీమ్ ఈ ట్రోలింగ్ ని కూడా ఎంజాయ్ చేయొచ్చు.
అన్నట్టు మరికొన్ని గంటల్లోనే తన తదుపరి చిత్రం శ్యామ్ సింగరాయ్ ఫస్ట్ లుక్ తో మరోసారి మనల్ని పలకరించనున్నాడు నాని. ఏదేమైనా కరోనా వల్ల వచ్చిన గ్యాప్ ని కూడా కవర్ చేసేసేలా వెరైటీ సబ్జెక్టులతో వరుసగా వడి వడిగా సినిమాలు చేసేస్తోన్న నానికి అల్ ది బెస్ట్ చెప్పేద్దాం. హ్యాపీ బర్త్ డే నేచురల్ స్టార్..!!