Advertisement
Google Ads BL

ఈ జంట వెంటనే మరో సినిమా అంట


రంగస్థలం లాంటి బిగ్గెస్ట్ హిట్ సినిమాని తృటిలో కోల్పోయిన అనుపమ పరమేశ్వరన్.. ఆ డ్యామేజ్ ని కంట్రోల్ చేసుకునే దిశగా వడివడిగా సినిమాలు ఒప్పుకుంటుంది. వచ్చిన ఏ అవకాశాన్ని వదిలిపెట్టకూడదనుకుంటుంది. ప్రస్తుతం నిఖిల్ తో 18 పేజెస్ సినిమాలో చేస్తుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోస్ ని పోస్ట్ చేస్తూ అందరిని కవ్విస్తుంది కూడా. ఇక హీరో నిఖిల్ కూడా అర్జున్ సురవరం అనే సినిమా హిట్ తో ఉత్సాహంగా ఉన్నాడు. దానికి తోడు లాక్ డౌన్ లో పెళ్లి చేసుకుని కొత్త పెళ్లికొడుకులా సరికొత్త తేజంతో 18 పేజెస్ లొకేషన్స్ లోకి ఎంటర్ అయ్యాడు.

Advertisement
CJ Advs

సుకుమార్ అసిస్టెంట్ సూర్య ప్రతాప్ దర్శకత్వంలో 18 పేజెస్ షూటింగ్ జరుగుతుంది. 18 పేజెస్ ఆల్రెడీ బాగా వస్తుంది అనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఇదిలా ఉండగా 18 పేజెస్ తర్వాత నిఖిల్ నటించబోయే సినిమా కార్తికేయ 2. చందు మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కిన కార్తికేయ మంచి సక్సెస్ సాధించింది. సవ్యసాచి సినిమా తర్వాత చందు మొండేటి మరే సినిమా ఒప్పుకోకుండా కార్తికేయ 2 స్క్రిప్ట్ మీదే సిన్సియర్ గా వర్క్ చేస్తూ ఫుల్ బౌండ్ బుక్ రెడీ చేసుకున్నాడు. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ లో వర్క్ కూడా స్టార్ట్ చేసాడు. కార్తికేయ 2 లో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ నే నటించబోతుంది. ఇదే జంట కంటిన్యూస్ గా రెండు సినిమాల్లో రిపీట్ కాబోతున్నారు. చూద్దాం వీళ్లిద్దరి కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్ మీద ఎలా ఉంటుందో.. ఎన్ని మెరుపులు మెరిపిస్తుందో అనేది. 

The couple will be making another film soon:

Anupama Parameswaran to romance Nikhil in Karthikeya 2
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs