Advertisement
Google Ads BL

మార్చి 5 కి పెరుగుతున్న పోటీ


థియేటర్స్ ఓపెన్ అయినదగ్గరనుండి.. హీరోలంతా తమ సినిమా డేట్స్ ని ప్రకటిస్తూ హడావిడి గా ఉన్నారు. చాలామంది హీరోలు రిలీజ్ డేట్స్ ప్రకటించినా కొంతమంది హీరోలు ముందుకు వెనక్కి షిఫ్ట్ అవుతున్నారు. అందులో రేపు 26 న రిలీజ్ డేట్ అంటూ ఇచ్చి మళ్ళి మార్చి 5 కి డేట్ మార్చారు A1 ఎక్స్ప్రెస్ యూనిట్ సభ్యులు. ఇక తాజాగా రాజ్ తరుణ్ పవర్ ప్లే రిలీజ్ డేట్ కూడా మార్చి 5  అంటూ ప్రకటించారు. మరి A1 ఎక్స్ప్రెస్, రాజ్ తరుణ్ పవర్ ప్లే, దిల్ రాజు షాదీ ముబారక్, అర్ధశతాబ్దం, A  లాంటి సినిమాలన్నీ మర్చి 5 నే రిలీజ్ కాబోతున్నాయి. 

Advertisement
CJ Advs

మార్చి 5న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రాజ్ త‌రుణ్, కొండా విజ‌య్ కుమార్‌ల పవర్ ప్లే

యంగ్ హీరో రాజ్ త‌రుణ్, కొండా విజ‌య్ కుమార్‌ల‌ స‌క్సెస్‌ఫుల్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న లేటెస్ట్ మూవీ పవర్ ప్లే. శ్రీ‌మ‌తి ప‌ద్మ స‌మ‌ర్ప‌ణ‌లో వ‌న‌మాలి క్రియేష‌న్స్ ప్రై.లి ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా రూపొందుతోన్నఈ చిత్రాన్ని మ‌హిద‌ర్‌, దేవేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్‌మోష‌న్ పోస్ట‌ర్‌, టీజ‌ర్‌, ట్రైల‌ర్‌కి మంచి  రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ చిత్రాన్ని స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా మార్చి 5న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేయ‌నున్నారు. ఈ మూవీని యూఎస్ఎ లో గ్రేట్ ఇండియా ఫిలింస్ రిలీజ్ చేస్తుండ‌గా ఆస్ట్రేలియాలో స‌థ‌ర‌న్ స్టార్ ఇంట‌ర్‌నేషన‌‌ల్‌, మిడిల్ ఈస్ట్‌లో మ‌ను రిలీజ్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా..

చిత్ర నిర్మాతల్లో ఒకరైన దేవేష్ మాట్లాడుతూ  -  రాజ్ త‌రుణ్‌, కొండా విజ‌య్ కుమార్ కాంబినేష‌న్‌లో డిఫ‌రెంట్ జోన‌ర్‌లో వ‌స్తోన్న చిత్ర‌మిది. మార్చి 5న వ‌రల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేస్తున్నాం.  ఈ సినిమా ఆంధ్రా, తెలంగాణ‌లో వరంగల్ శ్రీను కార్తికేయ ఎగ్జిబిట‌ర్స్ ద్వారా గ్రాండ్‌గా విడుద‌ల‌వుతుంది. అలాగే  యూఎస్ఎ లో గ్రేట్ ఇండియా ఫిలింస్, ఆస్ట్రేలియాలో స‌థ‌ర‌న్ స్టార్ ఇంట‌ర్‌నేషన‌‌ల్‌, మిడిల్ ఈస్ట్‌లో మ‌ను రిలీజ్ చేస్తున్నారు. అన్ని క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ మూవీ త‌ప్ప‌కుండా ఆడియ‌న్స్‌ని థ్రిల్ చేస్తుంది అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ పా‌ల‌ప‌ర్తి అనంత్ సాయి మాట్లాడుతూ  -  పోస్ట్ ప్రొడక్షన్ తో సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మార్చి 5న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా విడుద‌ల‌వుతున్న ప‌వ‌ర్‌ ప్లే  త‌ప్ప‌కుండా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తుంది అన్నారు.

Power Play Worldwide Grand Release On March 5th:

Raj Tarun - Konda Vijaykumar Power Play Worldwide Grand Release On March 5th
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs