Advertisement
Google Ads BL

మోహన్ లాల్ తన తప్పు దిద్దుకోవాలట


నటుడిగా మోహన్ లాల్ గురించి కొత్తగా చెప్పేది ఏం లేదు. ఏ కంప్లీట్ యాక్టర్ అంటూ యావత్ భారత దేశం అంతా ఆయన్ని అభినందిస్తూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు ప్రతి చిత్రంలోను ప్రతి పాత్రలోనూ మమేకం అయిపోయి అద్భుతంగా నటించే మోహన్ లాల్ తాజాగా దృశ్యం 2 తో మరోసారి మొత్తం అందరి ప్రశంశలు అందుకుంటున్నారు. దృశ్యం 2 లో తన నటనతో అందరిని కట్టి  పడేసారు. అయితే ఇప్పుడు మోహన్ లాల్ ఏదో తప్పు చేసేసినట్టుగా ఆయనపై కంప్లైంట్స్ వర్షం కురుస్తుంది కేరళలో. ఇంతకీ విషయం ఏమిటంటే దృశ్యం 2 లాంటి మంచి సినిమాని థియేటర్స్ కి ఇవ్వకుండా డైరెక్ట్ ఓటిటిలో విడుదల చేయడంపై అక్కడి ఎగ్జిబిటర్స్, థియేటర్స్ యాజమాన్యాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
CJ Advs

కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే థియేటర్స్ ఓపెన్ అయ్యి కాస్త కోలుకుంటున్న టైం లో దృశ్యం లాంటి మంచి సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యిఉంటే ఉపశమనం లభించేది. ఊపొచ్చేది అని భావిస్తే.. ఇలా దృశ్యం సినిమాని ఓటిటికి ఇచ్చేసారు. ఇంతమంచి సినిమాని ఓటిటికి ఇచ్చారని భావిస్తూ ఈ తప్పుని దిద్దుకోవాలి.. మా కోసం అయినా దృశ్యం 3 తియ్యాలంటూ మోహన్ లాల్ ని అడుగుతున్నారట. మరి దృశ్యం 3 సినిమాపై మోహన్ లాల్ అండ్ దృశ్యం డైరెక్టర్ జీతూ జోసెఫ్ లు కూడా చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. మే బీ దృశ్యం 3 న్యూస్ కూడా త్వరలోనే వింటామేమో. ఎందుకంటే దృశ్యం 2 వన్ అఫ్ ద బెస్ట్ సీక్వెల్ ఇన్ ఇండియా అంటూ దృశ్యం సినిమాని ఓటిటిలో వీక్షించిన ప్రేక్షకుల మాట. మరి మళ్లీ ఇదే కాంబినేషన్ లో దృశ్యం 3 వస్తే ఆ హైప్ ఏ రేంజ్ లో ఉంటుందో అనేది చెప్పక్కర్లేదు. 

Mohanlal wants to correct his mistake:

Drishyam 2 One of the best sequel in India
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs