Advertisement
Google Ads BL

చేసేది మహేష్ తో.. చూస్కోవాలి కదా


పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా కోసం తొలిసారిగా కలిసి నటించబోతున్నారు మహేష్ బాబు - కీర్తి సురేష్ లు. గత ఏడాది సంక్రాంతికి వచ్చిన సరిలేరు నీకెవ్వరూ సినిమా తర్వాత కరోనా ఎఫెక్ట్ తో వన్ ఇయర్ ఖాళీగానే కూర్చున్న మహేష్ బాబు .. సరికొత్త ఎనెర్జీతో దుబాయ్ లో మొదలైన సర్కారు వారి పాట సినిమా సెట్స్ లోకి ఎంటర్ అయ్యారు. రోజు రోజుకి ఏజ్ తగ్గిపోతుందా అనే గ్లామర్ తో మతి పోగొడుతూనే ఈసారి తన మజిల్ పవర్ మ్యాజిక్ కూడా చూపిస్తా అంటూ మహేష్ బాబు జిమ్ లో స్పెషల్ ట్రైనర్ ఆధ్వర్యంలో సీరియస్ వర్కౌట్స్ అవి చేస్తున్నారు. మహేష్ బాబు అంత అందగాడిలా మెరిసిపోతుంటే.. సర్కారు వారి పాట హీరోయిన్ కీర్తి సురేష్ ని చూడండి. పై ఫొటోస్ లో కీర్తి సురేష్ ఎలా ఉందో.

Advertisement
CJ Advs

రీసెంట్ గా సర్కారు వారి పాట కోసం దుబాయ్ వెళ్ళినప్పుడు తీసిన ఫొటోస్ అవి. ఆల్రెడీ పెంగ్విన్, మిస్ ఇండియా సినిమాల్లోనే బక్కచిక్కిన కీర్తి సురేష్ ని చూసి పెదవి విరిచారు ప్రేక్షకులు. ఈ ముద్దుగుమ్మ కాస్త బొద్దుగా ఉన్నప్పుడే బాగుండేది కదా.. అంటూ. ఎంతో కళగా ఉండే కీర్తి సురేష్ మోహంలో ఆ గ్లో అనేది లేకుండా పోయింది. మహానటి కోసం బాగా బరువు పెరిగిన కీర్తి సురేష్ ఆ బరువే తన అవకాశాలు పోగొట్టింది అనే భ్రమలో .. 150 సూర్య నమస్కారాలు, జిమ్ లో స్పెషల్ వర్కౌట్స్ చేసి మరీ చిక్కిపోయినట్లుగా తయారయ్యింది. ఆ వర్కౌట్స్ తో కీర్తి సురేష్ కేవలం బరువు మాత్రమే తగ్గలేదు.. బరువుతో పాటు ఫేస్ లో కళ ని పోగొట్టుకుంది. అందంగా బబ్లీ ఫేస్ తో కళకళలాడే కీర్తి సురేష్.. ఇప్పుడు ఆ గ్లో కోల్పోయింది. మరి అందగాడు మహేష్ పక్కన ఛాన్స్ దొరగ్గానే ఎగిరి గంతేయ్యడం అటుంచి.. ఫేస్ మీద ఫోకస్ పెడితే బావుండేది. 

ముఖ్యంగా మహేష్ లాంటి మోస్ట్ గ్లామరస్ హీరో సరసన చేస్తున్నపుడు ఇంకాస్త ఎక్కువ కేర్ తీసుకోవాలి కదమ్మా కీర్తీ..!! 

Doing with Mahesh, should be taken care of!:

Mahesh - Keerthy Suresh Sarkaru Vaari paata shooting in Dubai
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs