Advertisement
Google Ads BL

దేవరకొండ బాలీవుడ్ కథ వేరే వుంది


విజయ్ దేవరకొండ స్టార్ హీరో గా ఎదుగుతున్న క్రమమంలోనే విజయ్ దేవరకొండ స్టయిల్ కి, క్రేజ్ కి బాలీవుడ్ ఫిదా అయ్యింది. బాలీవుడ్ హీరోయిన్స్ ఎప్పుడెప్పుడు రౌడీ హీరో విజయ్ తో కలిసి పని చేస్తామా? రౌడీ హీరో స్టయిల్ కి మేము ఫిదా అంటూ ఓపెన్ స్టేట్మెంట్స్ ఇచ్చేసారు. ఆ అవకాశం బాలీవుడ్ భామ అనన్య పాండే దక్కించుకుంది. లైగర్ పాన్ ఇండియా ఫిలిం లో విజయ్ దేవరకొండ సరసన ఛాన్స్ కొట్టేసింది అనన్య. అయితే విజయ్ దేవరకొండ కరణ్ జోహార్ ఫ్రెండ్ షిప్ ఎలాంటిదో డియర్ కామ్రేడ్ అప్పటినుండి చూస్తూనే ఉన్నాం. డియర్ కామ్రేడ్ తెలుగులో హిట్ అయినట్లయితే కరణ్ కచ్చితంగా డియర్ కామ్రేడ్ ని బాలీవుడ్ లో రీమేక్ చేసేవాడు. కానీ ప్లాప్ అవడంతో కాస్త తగ్గాడు. అప్పటినుండి కరణ్ జోహార్ విజయ్ దేవేరుకోండ స్నేహం కాస్తా లైగర్ తో హీరో ప్రొడ్యూసర్ స్థాయికి చేరింది. 

Advertisement
CJ Advs

ఇక పూరి జగన్నాధ్ లైగర్ మొత్తం ముంబై పరిసర ప్రాంతాల్లో షూట్ చెయ్యడంతో విజయ్ ఎప్పటినుండో ముంబై కే పరిమితమయ్యాడు. కరోనా వచ్చి హైదరాబాద్ రావడం.. రీసెంట్ గా మళ్ళీ ముంబైకి వెళ్లడం.. లైగర్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. అయితే విజయ్ దేవరకొండ కి బాలీవుడ్ స్నేహాలు ఎక్కువయ్యాయనిపిస్తుంది. మొన్నటికి మొన్న ఓ బిగ్ పార్టీలో సారా అలీ ఖాన్ విజయ్ దేవరకొండ తో సెల్ఫీ దిగి సోషల్ మీడియాని షేక్ చేసింది. తాజాగా విజయ్ దేవరకొండ బాలీవుడ్ యంగ్ బ్యూటీస్ తో మనీష్ మల్హోత్రా ఇచ్చిన బిగ్ పార్టీలో హల్ చల్ చేసాడు. సారా అలీ ఖాన్, అనన్య పాండే, ఛార్మి, కరణ్ జోహార్, కియార్ అద్వానీ, పరిణీతి చోప్రా, రకుల్ ప్రీత్, పూరి జగన్నాధ్, మనీష్ మల్హోత్రా ఇలా మనీష్ పార్టీలో హడావిడి చేసారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, కరణ్ జోహార్ యంగ్ బ్యూటీస్ కలిసి దిగిన ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరి పాన్ ఇండియా మూవీ తో బాలీవుడ్ కి అడుగుపెడుతున్నా విజయ్ దేవరకొండ బాలీవుడ్ పార్టీల యవ్వారం మాములుగా లేదనిపిస్తుంది. 

Devarakonda Bollywood story is different:

Celebrities at Manish Malhotra Party
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs