Advertisement
Google Ads BL

ఉప్పెన చూసిన నందమూరి బాలకృష్ణ


జస్ట్ ఇప్పుడే ఉప్పెన సినిమా చూసింది ఎవరో తెలుసా అంటూ మైత్రి మూవీ మేకర్స్ ట్విట్టర్ హ్యాండిల్ నుండి ఓ ట్వీట్ పడింది. ఆ ట్వీట్ పడగానే ఫాన్స్ సందడి మొదలైంది. కింద గెస్సింగ్స్ అన్నీ పవన్ కళ్యాణ్ అని కొంతమంది. కాదు ఈ సినిమా పట్ల ఆసక్తి కనబర్చి ట్వీట్ చేసిన మహేష్ బాబు అని కొంతమంది. లేదూ.. ఇన్నిరోజులు సైలెంట్ గా ఉన్న అల్లు అర్జున్ అని ఇంకొంతమంది.. ఇలా ఫాన్స్ అందరూ వాళ్ళ వాళ్ళ హీరోల పేర్లు ప్రస్తావించుకుంటూ రిప్లై లు ఇస్తూ ఉంటే ఎవ్వరూ ఊహించని విధంగా తెరపైకి వచ్చారు నందమూరి నటసింహం బాలకృష్ణ.

Advertisement
CJ Advs

ఉప్పెన సూపర్ సక్సెస్ తో మంచి జోరు మీదున్న మైత్రి మూవీ యూనిట్ లో మరింత జోష్ నింపారు నందమూరి బాలకృష్ణ. అతి త్వరలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానేర్ లో గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఓ ప్రస్టేజియస్ ఫిలిం చెయ్యబోతున్న బాలకృష్ణ తన నిర్మాతలకు తాజాగా దక్కిన ఘన విజయాన్ని అభినందిస్తూ ప్రత్యేకించి ఉప్పెన సినిమాని తన ఫ్యామిలీతో కలిసి వచ్చి మరీ చూసారు. అంతేకాకుండా సినిమా యూనిట్ ని ప్రత్యేకంగా అభినందించడంతో మైత్రి మూవీ అధినేతల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఈ విషయాన్నీ మైత్రి వారు ట్విట్టర్ లో సగర్వంగా ప్రకటించుకుని ఫోటో తో సహా పోస్ట్ చేసారు. 

కొత్తగా వచ్చే హీరోలను ఎప్పుడూ ప్రోత్సహించే బాలకృష్ణ మెగా కాంపౌండ్ హీరో అని కూడా చూడకుండా, ఎటువంటి భేషజాలకు పోకుండా ఉప్పెన నటీ నటులను, యూనిట్ సభ్యులను అభినందించడం విశేషం. అందుకే మా బాలయ్యబాబు పెద్ద మనసుకి, మంచి గుణానికి ఇదొక నిదర్శనం అంటూ సోషల్ మీడియాలో సందడి స్టార్ట్ చేశారు నందమూరి అభిమానులు. 

Nandamuri Balakrishna watches Uppena Movie:

Nandamuri Balakrishna enjoyed the screening of Uppena along with his family & appreciated entire cast and crew
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs