ఈ సమ్మర్ సీజన్ లో రాబోయే భారీ సినిమాల్లో విపరీతమైన హైప్ క్రియేట్ అయిన సినిమా ఒకటి బాలకృష్ణ - బోయపాటి BB3 (గాడ్ ఫాదర్). బాలయ్య - బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలు ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశాయో తెలిసిన విషయమే. వాళ్ళిద్దరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ ఫిలిం గా మాస్ లోనూ ఫాన్స్ లోనే కాదు.. ఎంటైర్ ట్రేడ్ లో ఈ సినిమా మీద ఓ స్పెషల్ ఇంట్రెస్ట్, అటెన్షన్ క్రియేట్ అయ్యి ఉన్నాయి. ఒకవైపు మిగతా భారీ సినిమాల డేట్స్ వచ్చేసి, బిజినెస్ అంతా చక చకా జరుగుతుంటే.. ఇప్పటివరకు BB3 విషయాలేమి బయటికి రాలేదు. అయితే రీసెంట్ గా ఈ సినిమా బిజినెస్ ఓపెన్ అయ్యింది అని తెలుస్తుంది.
చిరంజీవి ఆచార్య నైజాం రిలీజ్ వరంగల్ శ్రీను కి వెళితే.. దానికి పోటీగా మరో సీనియర్ హీరో అయిన బాలకృష్ణ BB3 (గాడ్ ఫాదర్) నైజాం రైట్స్ దిల్ రాజు తీసుకుంటున్నట్టు సమాచారం. నైజాం ఒక్కటే కాదు.. నైజాం, వైజాగ్ కలిపి దాదాపు 18 కోట్లకు పైగా ఫ్యాన్సీ ఆఫర్ తో దిల్ రాజు BB3 హక్కులు దక్కించుకునేందుకు సంసిద్ధులయ్యారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ ఒక్క ఏరియానే కాదు మిగతా ఏరియాల బిజినెస్ కూడా చాలా స్పీడు స్పీడుగా జరుగుతుంది. త్వరలోనే BB3 కి సంబందించిన మరిన్ని అప్ డేట్స్ మన ముందుకు వస్తాయి.