Advertisement
Google Ads BL

అల్లరి కళ్ళల్లో ఆనంద భాష్పాలు


నిన్న శుక్రవారం అల్లరి నరేష్ - విజయ్ కనకమేడల కాంబోలో తెరకెక్కిన నాంది సినిమా థియేటర్స్ లో విడుదలైంది. ఒక్క రోజే విశాల్ యాక్షన్ మూవీ చక్ర, కన్నడ డబ్బింగ్ పొగరు, సుమంత్ కపటధారి సినిమాలతో పాటుగా అల్లరి నరేష్ నాంది కూడా రావాల్సి వచ్చింది. దాంతో నిన్న రిలీజ్ అయిన నాంది సినిమాకి మార్నింగ్ షో, మ్యాట్నీ కలెక్షన్స్ చాలా నీరసంగా వచ్చాయి. అయితే మౌత్ టాక్ స్ప్రెడ్ అవడం వలన ఫస్ట్ షో, సెకండ్ షో ల కలెక్షన్స్ పర్వాలేదనిపించాయి. ఓవరాల్ గా ఫస్ట్ డే కలెక్షన్స్ మామూలుగానే ఉన్నా.. నాంది సినిమాకి మాత్రం అటు పబ్లిక్ నుండి ఇటు మీడియా నుండి కూడా కంప్లీట్ పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఈ రోజు టోటల్ సీన్ రివర్స్ అయ్యింది. నాంది రిలీజ్ అయిన థియేటర్స్ అన్ని కళకళలాడుతున్నాయి.

Advertisement
CJ Advs

కలెక్షన్స్ ఒక్కసారిగా పుంజుకున్నాయి. కొన్ని సెంటర్స్ లో హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిస్తున్నాయి. రెవిన్యూ పరంగా చూసుకుంటే నాంది కి నిన్నటికంటే ఈ రోజు డబుల్ కలెక్షన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే విధంగా రేపు కూడా అదే రేంజ్ రెవిన్యూ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఈ వీకెండ్ కలెక్షన్స్ తోనే సినిమా గట్టెక్కేయ్యొచ్చు. అదలా ఉంటే రీసెంట్ గా జరిగిన నాంది సక్సెస్ సెలెబ్రేషన్స్ లో అల్లరి నరేష్ మాట్లాడుతూ ఎప్పుడో 2012 లో సుడిగాడు సినిమా విడుదలైనప్పుడు విన్నాను ఈ సక్సెస్ టాక్ అనేది. ఇన్నేళ్ల తర్వాత మళ్ళి ఈరోజు ఈ సక్సెస్ టాక్ వింటున్నా.. అంటూ చెమర్చిన కళ్లతో ఉద్వేగానికి లోనవడం అందరిని కదిలించింది. ఇప్పటికే నాంది సినిమాలో అల్లరి నరేష్ నటనకు అంతటా ప్రశంశలు లభిస్తున్నాయి. దానికి తోడు నరేష్ ఎమోషనల్ అవడం చూసి చాలామంది నరేష్ కి నాంది లాంటి విజయం రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంచి సినిమాని ఎప్పుడూ ఆదరించే మన తెలుగు ప్రేక్షకుల అండతో ముందు ముందు నరేష్ నాంది సినిమా మరింత కలెక్షన్స్ పుంజుకునే అవకాశం ఉంది. అంతే కాదండోయ్ అవార్డుల రేసులోను నాంది సినిమా ముందు వరుసలోనే నిలిచే అవకాశాలు ఎక్కువ.

Tears in Allari Naresh eyes:

Allari Naresh emotional speech on Naandhi Success Celebrations
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs