Advertisement
Google Ads BL

పవన్ కోసం భారీ భారీ సెట్టింగ్స్


పవన్ కళ్యాణ్ - క్రిష్ కాంబోలో తెరకెక్కుతున్న పిరియాడికల్ మూవీ కోసం భారీ కసరత్తులు జరుగుతున్నాయి. గత ఏడాది ప్రారంభమైన క్రిష్ మూవీ కోసం పవన్ కళ్యాణ్ గెస్ట్ లా అప్పుడప్పుడు వచ్చి వెళుతున్నారు. గత నెలలో ఓ పది రోజుల షెడ్యూల్ చేసిన పవన్ కళ్యాణ్ మళ్ళీ రేపో మాపో క్రిష్ మూవీ సెట్ లోకి అడుగుపెట్టబోతున్నారు. అంటే మరో పది రోజులు క్రిష్ కోసం పవన్ డేట్స్ కేటాయించాడు. మరి మధ్య మధ్యలో ఏకే రీమేక్, అటు రాజకీయాలు అంటూ పవన్ బిజీ గా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ తో క్రిష్ చెయ్యబోయే సినిమా కోసం భారీ సెట్స్ అవసరమవుతున్నాయి. ఇప్పటికే అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్ లో పవన్ ఒక షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఇక అందులో భాగంగా నగర శివార్లలో చార్మినార్ సెట్ నిర్మాణం చేపట్టింది టీం. త్వరలో మొదలు కాబోయే షెడ్యూల్ ఆ చార్మినార్ సెట్ లోనే జరుగుతుంది.

Advertisement
CJ Advs

ఆలాగే ఈ కథకు రిలేటెడ్ గా ఉన్న గండి కోట సెట్ రాజీవ‌న్ నేతృత్వంలో నిర్మాణంలో ఉంది. క్రిష్ - పవన్ సినిమా 17వ శ‌తాబ్దం నాటి క‌థ ఇది. ఈ కథ మొత్తం భాగ్య‌న‌గ‌ర నేప‌థ్యంలో సాగుతుంది. అందుకే హైదరాబాద్ లో పురాతన కట్టడాలు అంటే 17వ శతాబ్దం కాలం నాటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఈ సెట్స్ నిర్మాణం చేపట్టినట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ పెడుతున్నారు. ఆ బడ్జెట్ లో సగం ఈ సెట్స్ నిర్మాణకే క్రిష్ ఖర్చు పెట్టిస్తున్నట్లుగా సమాచారం, ఇక బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ క్వీన్ గా కనిపించనున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గాను, అర్జున్ రామ్ పాల్ పవన్ ని ఢీ కొట్టబోయే పాత్రలోనూ నటిస్తున్నారు.

Hyderabad set for Pawan - Krish Movie:

Gandikota set for Pawan Kalyan and Krish film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs