చేతిలో మొబైల్ ఉన్న ప్రతి వ్యక్తి ట్విట్టర్ లో, ఫేస్ బుక్ లో, ఇంస్టాగ్రామ్ లలో అకౌంట్స్ ఓపెన్ చేసుకోవడం ఎవరికీ తోచిన కామెంట్స్ వాళ్లు పెట్టెయ్యడం.. ఈ ఫ్యాన్ వార్స్ ఇవన్నీ ఎక్కువైపోయాయి సోషల్ మీడియాలో. విచిత్రం ఏమిటంటే ఇప్పుడు మెగా ఫ్యామిలీలోనే అల్లు అర్జున్ ఫాన్స్ అంటే పవన్ ఫాన్స్ కి పడదు, రామ్ చరణ్ ఫాన్స్ అంటే అల్లు అర్జున్ ఫాన్స్ కి పడదు. బాలయ్య ఫాన్స్ అంటే ఎన్టీఆర్ ఫాన్స్ కి పడదు. నాగ చైతన్య ఫాన్స్ అంటే అఖిల్ ఫాన్స్ కి పడదు. ఇలా ఒక్క ఫ్యామిలిలోనే వర్గాలు వర్గాలు గా ఫాన్స్ అంతా డివైడ్ అయ్యిపోయి చిత్రవిచిత్రమైన కామెంట్స్ పెట్టుకుంటున్నారు.
ఇలాంటి విపరీత ధోరణి తమిళనాడులో ఎక్కువ. తమిళనాడులో అరవతంబీలు సోషల్ మీడియాలో అజిత్ ఫాన్స్, విజయ్ ఫాన్స్ ఇలా పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టేసుకుంటూ, పిచ్చి పిచ్చి గా మాట్లాడుకుంటూ కొట్టేసుకోవడం అనేది మనం ఆల్రెడీ గతంలో చూసాము. అదే సంస్కృతి మెల్ల మెల్లగా మనికి వస్తుంది. రీసెంట్ గా ప్రభాస్ లుక్స్ మీద పవన్ కళ్యాణ్ ఫాన్స్ కామెంట్ చేస్తే.. పవన్ కళ్యాణ్ మీద ప్రభాస్ ఫాన్స్ కామెంట్ చెయ్యడం, ప్రభాస్ గురించి పవన్ కళ్యాణ్ ని అనడం, భోజన ప్రియుడు అంటూ తారక్ మీద, అలాగే మహేష్ మీద కూడా ఫ్యాన్ వార్స్ ఎక్కువే. ఇలా సోషల్ మీడియా వార్స్ అనేవి కామన్ కాదు.. ఎక్కువైపోయాయి.
అయితే ఈ హీరోస్ అందరూ కూడా సఖ్యతగానే, ఫ్రెండ్లీ గానే ఉంటారు. ఒకళ్ళ సినిమాని ఒకళ్లు ప్రమోట్ చేసుకుంటారు. కానీ ఫాన్స్ విషయానికొచ్చేసరికి హీరోలు ఫాన్స్ ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఫాన్స్ తో ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా టచ్ లో ఉంటున్న ఇదే స్టార్స్ ఒక్క ట్వీట్ పెట్టొచ్చు కదా. వేరే హీరోస్ ని కామెంట్ చెయ్యకండి అని. ఈ ఫాన్స్ ని స్టార్స్ ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు.