Advertisement
Google Ads BL

ఆచార్య అంకెల లింకులు అర్ధం కావులే


కొరటాల శివ - చిరు కాంబోలో తెరకెక్కుతున్న ఆచార్య షూటింగ్ గత ఏడాది కరోనా క్రైసిస్ వలన లేట్ అయినా.. ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్ వేగం పుంజుకుంది.  షూటింగ్ కంప్లీట్ చేసుకునే దిశగా వేగంగా సాగుతుంది. అలాగే ఆచార్య బిజినెస్ వైజ్ గా చాలా స్పీడు స్పీడుగా బిజినెస్ డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఆచార్య నైజాం ఏరియా కి ఇంత ధర పలికింది. సీడెడ్ కి ఇంత ధర, ఓవర్సీస్ అంత ధర అంటూ ఆచార్య బిజినెస్ పై రోజుకో న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. అయితే ఇక్కడ మనకి బయట వ్యక్తం చేస్తున్న ఆచార్య అంకెలకు లోపల ఉన్న లింక్ లకి సంబంధమే లేదని అంతర్గత సమాచారం.

Advertisement
CJ Advs

ఆచార్య కి నైజాం రైట్స్ కింద 48 కోట్లు పెట్టి వరంగల్ శ్రీను కొనేసాడనే ప్రచారం జరిగింది. నిజానికి ఆచార్య నైజాం రైట్స్ 36 కోట్లే. అలాగే ఆచార్య ఓవర్సీస్ రైట్స్ కింద చెప్పిన అంకెలకు కూడా నిజానికి లింక్ లేదు. అన్ని ఏరియాస్ లో కూడా ఆచార్య నుండి బయటికొస్తున్న అంకెలకు.. వాళ్ళు కమిట్ అయిన అమౌంట్ కి సంబంధం లేదు. అవన్నీ బయటికి చెబుతున్న అంకెలే. ఒక అండర్ స్టాండింగ్ తో అన్ని ఏరియాల్లో రిలీజ్ చేస్తున్న సినిమా ఆచార్య. ప్రతి ఏరియా కి సంబందించిన బిజినెస్ ని దర్శకుడు కొరటాల శివనే డీల్ చేస్తున్నాడు. అంతా అండర్ స్టాండింగ్ ప్రకారమే వెళుతుంది. రేపు ఆచార్య రిలీజ్ అయ్యాక బయటికొచ్చే ఫిగర్స్ కూడా ఆ అండర్ స్టాండింగ్ లోనే ఉంటాయి. అసలు ఫిగర్స్ బయటికి ఎప్పటికి తెలియవు. ఇది ఆచార్య గారు ఇండస్ట్రీ కి నేర్పిస్తున్న కొత్త గుణపాఠం.

Is Acharya's business calculations true?:

Acharya digit links are not understandable
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs