Advertisement
Google Ads BL

తప్పుగా అర్ధం చేసుకున్నారంటున్న శృతి


శృతి హాసన్ సినిమాలకు భారీ గ్యాప్ ఇవ్వడం మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చి క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకోవడం.. ఒకే ఒక్క హిట్ తో కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ తో సాలార్ లో నటించే అవకాశం రావడం అన్ని వెంట వెంటనే జరిగిపోయాయి. అయితే ఒకప్పుడు కన్నడ సినిమాలను లైట్ తీసుకుని అసలు కన్నడ సినిమాల్లో నటించే అవకాశమే లేనట్లుగా శృతి హాసన్ చేసిన ట్వీట్ కి అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. అప్పుడు ముగిసిన ఆ ట్వీట్ వివాదం ఇప్పుడు మరోసారి తెరపైకి రావడంతో ఇప్పుడు శృతికి మరోసారి సెగ తగిలింది.

Advertisement
CJ Advs

ఎందుకంటే కన్నడ సినిమాల్లో నటించే అవకాశం లేదన్న శృతి హాసన్ ఇప్పుడు కన్నడ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ సలార్ లో నటిస్తుంది కాబట్టి. అప్పట్లో కన్నడ సినిమాలని తేలిగ్గా మాట్లాడిన శృతి హాసన్ ఇప్పుడు కన్నడ దర్శకుడితో సినిమా ఎలా చేస్తుంది అంటూ నెటిజెన్స్ శృతి హాసన్ ని ట్రోల్ చేస్తున్నారు. దానితో శృతి లైన్ లోకొచ్చి.. సలార్ లో ప్రభాస్ సరసన ప్రశాంత్ నీల్ తో కలిసి పని చెయ్యడం సంతోషంగా ఉందని.. సలార్ తో కన్నడ పరిశ్రమలో భామైనందుకు సంతోషంగా ఉందని.. సలార్ టీం చాలా ప్రత్యేకమైందని. సలార్ కథ, అందులోని నా పాత్ర ఎంతో నచ్చాయి కాబట్టే వెంటనే సలార్ ని ఓకె చేసానని చెబుతుంది శృతి హాసన్. అంతేకాకుండా గతంలో బిజీ షెడ్యూల్స్ వలన కన్నడ సినిమా అవకాశం వదులుకోవాల్సి వచ్చింది అని, కానీ కన్నడ నటులన్నా, అక్కడి దర్శకనిర్మాతలన్నా తనకి గౌరవం ఉందని.. కానీ తన ట్వీట్ ని తప్పుగా అర్ధం చేసుకున్నారంటూ వివరణ ఇస్తుంది శృతి హాసన్.

Shruti that seems to be misunderstood:

Shruti Haasan clarifies her 2017 tweet on not doing Kannada Films
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs