Advertisement
Google Ads BL

ఇక్కడి ట్రిక్కులు అక్కడ కుదరట్లేదు


టాలీవుడ్ లో ప్రొడ్యూసర్ గా కంటే కూడా వివాదాలతోనే ఎక్కువ పేరు తెచ్చుకున్న బెల్లకొండ సురేష్ తన తనయుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ని మాత్రం చాలా గట్టిగానే వెండితెరకు హీరోగా లాంచ్ చేసాడు. ఆ సినిమాకే కాదు.. ఆ తరవాత ప్రతి సినిమాకి తనవంతు జాగ్రత్తలు తీసుకుంటూనే వస్తున్నాడు. ముఖ్యంగా సాయి శ్రీనివాస్ పక్కన నటించే హీరోయిన్స్ అందరిని కూడా స్టార్ రేంజ్ ఉన్న హీరోయిన్స్ ని సెలెక్ట్ చెయ్యడంలో అందే వేసిన చెయ్యి సురేష్ ది. ఎంత ఖర్చయినా వెనకాడకుండా హీరోయిన్స్ ని తీసుకొస్తున్నాడు. ఇప్పటికే మనం గమనిస్తే సమంత, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, పూజ హెగ్డే లాంటి స్టార్ హీరోయిన్స్ ని పట్టుకొచ్చి తన తనయుడు పక్కన పెట్టేసిన ఘనత బెల్లంకొండ సురేష్ ది. 

Advertisement
CJ Advs

ఇక బాలీవుడ్ లో ఛత్రపతి రీమేక్ చేసేందుకు బెల్లకొండ శ్రీనివాస్ ఇప్పటికే ముంబై కి మకాం మార్చాడు. అక్కడ ఛత్రపతి రీమేక్ తీద్దామని రెడీ అవుతున్నారు. అయితే ఇక్కడ స్టార్ రేంజ్ హీరోయిన్స్ విషయంలో చేసిన ట్రిక్స్ బాలీవుడ్ లో మాత్రం వర్కౌట్ అవ్వడం లేదు బెల్లంకొండ బాబుకి. బెల్లంకొండ చెక్కులకి ఎవరూ అట్రాక్ట్ అవ్వడం లేదు. ఏ హీరోయిన్ బెల్లకొండ ఆఫర్ ని యాక్సెప్ట్ చెయ్యడం లేదు. ఇప్పటికే కైరా అద్వానీ, అలియా భట్, సారా అలీఖాన్, కృతి సనన్, అనన్య పాండే ఇలాంటి చాలామంది హీరోయిన్స్ ని బెల్లంకొండ శ్రీనివాస్ కోసం అప్రోచ్ అయినా.. ఎవ్వరూ ఒప్పుకోవడం లేదు. 

బాలీవుడ్ లో బెల్లకొండ శ్రీనివాస్ కి సరైన హీరోయిన్ దొరకడం గగనమైపోయింది. అయితే ఈలోపు ఇక్కడ టాలీవుడ్ లో యూవీ క్రియేషన్స్ లో ఓ తెలుగు సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు శ్రీనివాస్. చూద్దాం బెల్లంకొండ బాబు అక్కడ బాలీవుడ్ లో హీరోయిన్ ని సెట్ చేసుకుంటాడా? లేదంటే ఇక్కడి సినిమాతో సర్దుకుపోతాడా?

The tricks here are not up there:

Bollywood Heroines Rejects Bellamkonda Sreenivas
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs