మెగా కాంపౌండ్ నుండి కొత్త హీరో వెండితెరకు హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. మొదటి సినిమాతోనే పెద్ద హిట్ కొట్టాడు. అదే ఉప్పెన సినిమా. వైష్ణవ తేజ్ ఉప్పెన తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా తాలూకు కలెక్షన్స్ ఏమో ఉప్పెనలా వచ్చి పడుతున్నాయి. ఇండస్ట్రీ మొత్తం హర్షిస్తుంది. మహేష్ బాబు ఎక్కడో దుబాయ్ లో సర్కారు వారి పాట షూటింగ్ లో బిజీగా వున్నా కూడా మెగా హీరో డెబ్యూ మూవీ పై ట్వీట్ పెట్టాడు. ఇక మెగా హీరోల గురించి చెప్పాల్సిన పని లేదు. చిరంజీవి, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ దగ్గరనుండి అందరూ కూడా ఉప్పెన సినిమా విషయంలో రెస్పాండ్ అయ్యారు. మెగా హీరో వైష్ణవ తేజ్ ని అప్రిషెట్ చేసారు.
కానీ బన్నీ నుండి ఇప్పటివరకు ఎలాంటి రియాక్షను లేదూ. ఈ గుంపులో గోవిందంలా కలిసిపోకూడదనుకున్నాడా? లేదంటే స్పెషల్ గా ఇంకేదన్నా ప్లాన్ చేస్తున్నాడా? ఆయన చేష్టలు ఎప్పుడూ అయోమయమే. ఇప్పటిదాకా అల్లు అర్జున్ రియాక్ట్ కాకపోవడం అనేది మాత్రం ఫాన్స్ కి రుచించడం లేదు. ఇప్పటికే మెగా కాంపౌండ్ కి అల్లు కాంపౌండ్ కి బాగా గ్యాప్ వచ్చింది అనుకుంటున్నారు. బన్నీ ఇస్తున్న ఈ గ్యాప్ అందరిలో అనుమానాలు ఇంకా పెంచేలా ఉంది. ఎంతగా పుష్ప షూటింగ్ లో బన్నీ బిజీ అనుకుందామనుకున్నా.. పుష్ప డైరెక్టర్ సుకుమార్ ఉప్పెన టీం తోనే తిరుగుతూన్నాడు. మరి బన్నీ ఓ చిన్న కాంప్లిమెంట్ తో డెబ్యూ హీరోని ఎంకరేజ్ చేసుంటే బావుండేది.