ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో BB3 చేస్తున్న బాలయ్య, ఒక వైపు అటు హిందూ పూర్ ఎమ్యెల్యేగా రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటూనే.. BB3 సినిమా షూటింగ్ కంప్లీట్ చేస్తున్నారు. అంత బిజీగా ఉన్న బాలయ్య కోసం డైరెక్టర్స్ పోటీ పడడం అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో గోపీచంద్ మలినేనితో మూవీ ఆల్రెడీ కన్ఫర్మ్ అయ్యింది. గోపీచంద్ మలినేని - బాలయ్య కాంబో మూవీ పవర్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ గా ఉండబోతుంది అనే టాక్ ఉంది. ఇది ఇలా ఉంటే.. బాలయ్యకి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన బి.గోపాల్ ఇంకో సూపర్ స్క్రిప్ట్ పట్టుకుని బాలయ్య కోసం వెయిటింగ్. అలాగే ఎస్.వి. కృష్ణారెడ్డి కూడా.
దర్శకుడిగా చాలా గ్యాప్ తీసుకున్న ఎస్.వి కృష్ణారెడ్డి.. ఓ బిగ్ ప్రొడక్షన్ హౌస్ తో ఎక్సపెరిమెంటల్ స్క్రిప్ట్ తో బాలయ్యని అప్రోచ్ అవడం, బాలయ్య కూడా కృష్ణారెడ్డి స్క్రిప్ట్ కి సానుకూలంగా స్పందించడంతో మరోపక్క కృష్ణారెడ్డి వెయిటింగ్. వాళ్ళు అలా ఉంటే.. యంగ్ డైరెక్టర్ కందిరీగ సంతోష్ శ్రీనివాస్ ఏకంగా బలరామయ్య బరిలోకి దిగితే స్క్రిప్ట్ పట్టుకుని బాలయ్య చుట్టూ తిరిగితున్నాడు. టైటిల్ తో సహా బాలయ్యకి స్క్రిప్ట్ వినిపించాలనే తపనతో ఉన్నాడు. ఇంతమంది డైరెక్టర్స్ బాలయ్య కోసం వెయిటింగ్. ఇది నిజంగా షాకింగ్ విషయమే. బాలయ్య అంత ఉదృతంగా సినిమాలు చేసే మూడ్ లో ఉన్నారో? లేదో? తెలియదు కానీ.. చేస్తే మాత్రం కంటిన్యూస్ గా ప్రాజెక్ట్స్ సెట్ అవడానికి రెడీగా ఉన్నాయి.