రెండు సంవత్సరాల క్రితం బాలీవుడ్ లో బాదాయి హో అనే సినిమా వచ్చింది. ఆ సినిమా అప్పట్లో సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఆయుష్మాన్ ఖురానా కి అద్భుతమైన పేరొచ్చింది. ఆ సినిమా కాన్సెప్ట్ ని కూడా అందరూ హిలేరియస్ గా ఎంజాయ్ చేసారు. అసలు బాదాయి హో సినిమా కాన్సెప్ట్ ఏమిటి అంటే.. తన తల్లికి తాను లవ్ చేసిన అమ్మాయిని పరిచయం చేద్దాం అని తీసుకొచ్చిన టైం కి తన తల్లి ప్రెగ్నెంట్ అయ్యి ఉండడం అనేది అందరిని బాగా నవ్వించింది. ఆ ఏజ్ లో ఆవిడ ప్రెగ్నెంట్ ఏమిటి అనేదీ. అది ఎక్సట్రార్డినరీ స్క్రీన్ ప్లే తో ఆ ట్రీట్మెంట్ తో చాలా బాగా వర్కౌట్ అయ్యింది. అది యాజిటీజ్ గా రీమేక్ రైట్స్ తీసుకుని చేసుకున్నా బావుండేదేమో?
కానీ దాన్ని రీమేక్ చెయ్యకుండా కొట్టేద్దామని చూసారు. దానికి రివర్స్ స్క్రీన్ ప్లే రాసారు. అదే ఎఫ్.సి.యు.కె. ఎఫ్.సి.యు.కె లో కూడా హీరో- హీరోయిన్ ని తీసుకుని.. కొడుకు ఒక అమ్మయితో ప్రేమలో పడి, ఆ అమ్మాయిని లవ్ చేసిన విషయం తండ్రికి చెప్పే టైం కి తండ్రికి ఓ చిన్న పాప ఉంది అనేదీ తెలియడం అనే కాన్సెప్ట్ తో ఈ మూవీని తెరకెక్కించారు. అలా బాలీవుడ్ నుండి కథని కొట్టేద్దామని చూసారు. కానీ జనం మాత్రం పసిగట్టేసారు. సోషల్ మీడియాలో దీని మీద పోస్ట్ లు బాగానే పడుతున్నాయి.అంతేకాదు ఎఫ్.సి.యు.కె సినిమా కూడా అస్సలు వర్కౌట్ అవ్వలేదు. చాలామంచి బ్యానర్ అని చెప్పుకునే రంజిత్ బ్యానర్ నుండి ఇలాంటి ప్రాజెక్ట్ రావడం మాత్రం అందరికి నిరాశాజనకంగా అనిపించింది.