Advertisement
Google Ads BL

కాజూ.. ఇది నిజమేనా బంగార్రాజు.?


నిన్నమొన్నటివరకు సైలంట్ గా ఉన్న నాగార్జున ఒక్కసారిగా జోరు పెంచాడు. ఉదయం బాలీవుడ్ బ్రహ్మాస్త్ర అప్ డేట్ ఇచ్చిన నాగార్జున.. మధ్యాన్నానికి ప్రవీణ్ సత్తారు మూవీ ఓపెనింగ్ చేసి చూపించాడు నాగ్. లైన్ లో కళ్యాణ్ కృష్ణ తో బంగార్రాజు ఉంది. ఇక  ఐశ్వర్య రాయ్, సుష్మిత సేన్ దగ్గర నుండి ప్రస్తుత క్రేజీ హీరోయిన్ రకుల్, క్రేజీ బుల్లితెర రాణి అనసూయ వరకు ఎవ్వరిని వదలకుండా స్క్రీన్ షేర్ చేసుకున్న నాగార్జున బంగార్రాజులో ఇంకా రెచ్చిపోబోతున్నాడట. ఈ సినిమా కోసం నాగ్ సరసన నటించేందుకు కాజల్ ని అప్రోచ్ అయ్యారట. కళ్యాణ్ కృష్ణ - నాగార్జున కాంబోలో హిట్ మూవీగా వచ్చిన సోగ్గాడే చిన్ని నాయనలో అనుష్క, లావణ్య త్రిపాఠి, అనసూయ, హంసా నందిని, దీక్ష పంత్ ఇంతమంది హీరోయిన్స్ ఉన్న విషయం తెలిసిందే. 

Advertisement
CJ Advs

బంగార్రాజు కూడా అలానే గ్లామరస్ క్వీన్స్ తో కళకళలాడిపోనుంది. మెయిన్ హీరోయిన్ పాత్ర కోసం కాజల్ ని సంప్రదించినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడున్న యంగ్ హీరోస్ అందరితోనూ ఆడిపాడిన కాజల్ సీనియర్ హీరోస్ లో మాత్రం ఓన్లీ చిరంజీవి గారితోనే ఖైదీ నెంబర్ 150 లో నటించింది. అలాగే రీసెంట్ గా ఆచార్య మూవీలో నటిస్తుంది. నిజంగా బంగార్రాజు ని కాజల్ ఓకె చేస్తే గనక చిరు తర్వాత నెక్స్ట్ సీనియర్ హీరో నాగార్జునే అవుతారు. ఇది మాత్రం జరిగేలాగే కనిపిస్తుంది. కాజు విత్ బంగార్రాజు. అక్కినేని ఫాన్స్ లెట్స్ వెయిట్ ఫర్ హై ఫీస్ట్.

Kaju, is this really Bangaraju ..?:

Kajal romance to Nagarjuna in Bangarraju Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs