Advertisement
Google Ads BL

ఈ ఉప్పెన ఇప్పటిది కాదు


ప్రస్తుతం బాక్సాఫీసు వద్ద ఉప్పెన అనే సినిమా ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో..ఎంతటి వసూళ్లు రాబడుతుందో మనం చూస్తున్నాం. అయితే నిజానికి ఈ ఉప్పెన ఇప్పటిది కాదు. అప్పుడప్పుడు తెలుగు సినిమా పరిశ్రమకి ఇలాంటి యూత్ ఫుల్ సునామీలు తగులుతూనే ఉంటాయి. అది కూడా ముఖ్యంగా కొత్త హీరో - హీరోయిన్స్ చేసిన సినిమాలు బాక్సాఫీసు దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసిన దాఖలాలు చాలా ఉన్నాయి. ఒకసారి వాటిని పరిశీలిస్తే.. నువ్వేకావాలి. తరుణ్ - రిచా డెబ్యూ సినిమా. నువ్వే కావాలి సినిమా అప్పట్లో యూత్ ఫుల్ హిట్. ఏడాదికి పైగా థియేటర్స్ దగ్గర సందడి చేసిన నువ్వేకావాలి తో తరుణ్ హీరోగా సెటిల్ అయ్యాడు. 

Advertisement
CJ Advs

తర్వాత తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమా. నితిన్ - సదా డెబ్యూ మూవీ. బిగ్గెస్ట్ హిట్. అప్పట్లో బాక్సాఫీసు సునామి సృష్టించింది. రికార్డులను కొల్లగొట్టింది. నెక్స్ట్ దేవదాస్. రామ్ - ఇలియానా జంటగా వై వి ఎస్ చౌదరి తెరకెక్కించిన సినిమా. అప్పట్లో సూపర్ హిట్ అయ్యి.. రామ్ ని ఇలియానా ని స్టార్స్ ని చేసింది.. సిల్వర్ జూబ్లీ హిట్ అయ్యింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఉప్పెన. ఉప్పెన  సినిమాతో ఓవర్ నైట్ స్టార్స్ అయ్యారు వైష్ణవ తేజ్, కృతి శెట్టి. ఉప్పెన సినిమా బాక్సాఫీసు ని షేక్ చేస్తుంది. మరి మళ్ళీ ఇలాంటి సునామి ఇంకెవరు క్రియేట్ చేస్తారో.. అది ఎప్పుడు వస్తుందో వెయిట్ చేద్దాం.

 

This Uppena is not from now:

When do Uppena ike hits happen?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs