గత శుక్రవారం ఉప్పెన సినిమాతో పాటుగా భారీ ప్రమోషన్స్ మధ్యన జగపతి బాబు మెయిన్ లీడ్ గా తెరకెక్కిన ఎఫ్.సి.యు.కె సినిమా కూడా రిలీజ్ అయ్యింది. భారీ ప్రమోషన్స్, రోజు ఓ సాంగ్ రిలీజ్ చెయ్యడమో.. లేదంటే ఎఫ్.సి.యు.కె ప్రెస్ మీట్స్ అంటూ హడావిడీ చేస్తూ సినిమాపై బాగా హైప్ క్రిటెట్ చేసారు నిర్మాతలు. కానీ ఎఫ్.సి.యు.కె విడుదలయ్యాక కానీ సినిమాలో ఎంత కంటెంట్ ఎలాంటి కంటెంట్ ఉందో అర్ధం కాలేదు ప్రేక్షకులకి. సినిమా మొత్తం వల్గర్ కామెడీ, వల్గర్ డైలాగ్స్ అబ్బో సినిమాలో చూడడానికి ఆ వల్గారిటీ తప్ప మరొకటి లేదు. కనీసం జగపతి బాబు కేరెక్టర్ అయినా చూడడానికి బావుటుంది అనుకుంటే.. 60 వయసులో సెక్స్ వర్కర్ తో బిడ్డని కనడం, దాన్ని సమర్ధించుకోవడం అనేది ఆయన అభిమానులకే చిరాకు తెప్పించింది.
ఏ వయసులోనైనా కోరికలుంటే తీర్చుకోవడం తప్పులేదని, సమాజం కోసం పెద్ద వయసుపేరుతో అణచుకోవాల్సిన అవసరం లేదంటూ చెప్పే బూతు డైలాగ్స్ తో ఆడియన్స్ కి పిచ్చెక్కింది. ఎంతో గుడ్ విల్ ఉన్న ప్రొడ్యూసర్ ఇలాంటి బ్యానర్, ఇలాంటి ప్రొడ్యూసర్ నుండి ఇలాంటి సినిమాని ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చెయ్యలేదు. చేసుండరు కూడా. ఫస్ట్ డే మార్నింగ్ షో నుండే ఎఫ్.సి.యు.కె కి నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. అటు రివ్యూస్ పరంగా ఇటు రెవిన్యూ పరంగా కూడా సోది లోకి లేకుండా పోయింది. ఎఫ్.సి.యు.కె థియేటర్స్ కి ఎదురు రెంట్స్ కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. మొదటి రోజునుండి.. అందుకే మూడో రోజుకే డిజిటల్ మెట్లెక్కేసింది. మూడో రోజు నుండే ఎఫ్.సి.యు.కె డిజిటల్ స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది.